సాధ్వీ రాథేమా పై ఆరోపణలు

0
59

సాధ్వీ రధేమా పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. మొదటి నుండి వివాదాస్పద సాధ్వీగా పేరుగాంచిన సుఖ్వీందర్ కౌర్ అలియాస్ రాధేమా పై ఒక వ్యక్తి కోర్టు కెక్కాడు. ఆమె తన పట్ల అసభ్యంగా ప్రవర్తించిందని విశ్వ హింధూ పరిషత్ కి చెందిన సురేందర్ మిత్తల్ ఆరోపిస్తున్నారు. తనని తాను దైవంగా చెప్పుకుంటన్న ఈ సాద్వీపై గతంలోనూ అనేక ఆరోపణలు ఉన్నాయి. రాథేమా తనకు తరచూ ఐలవ్యూ అంటూ చెప్తూ వేధించడంతో పాటుగా తనతో అసభ్యంగా ప్రవర్తించిందని తన మాట వినకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ బెదిరింపులకు దిగేదని మిత్తల్ ఆరోపిస్తున్నాడు. తన మాట వినని వారిని శపిస్తానంటూ హెచ్చరించినట్టు మిత్తల్ చెప్తున్నారు.
సాధ్వీ వేధింపులు పడలేక కేసు పెట్టినట్టు మిత్తల్ తెలిపారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ఆయన అంటున్నాడు. రాధేమా, గుర్మీత్ రామ్ రహీమ్ లాంటి వారు ఆధ్యాత్మికత ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్నారని ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మిత్తల్ కోరుతున్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here