విద్యార్థులకు పూర్తి ఫీజులు చెల్లించాలి:ఆర్. కృష్ణయ్య

0
50

తెలంగాణలో బీ.సీ విద్యార్థులకు కూడా పూర్తి స్థాయిలో ఫూజులను రీయంబర్స్ చేయాలని ఎల్.బి.నగర్ శాసనస సభ్యుడు ఆర్.కృష్ణయ్య అసెంబ్లీలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం బీ.సీ లకు ఇస్తున్న ఫీజ్ రియంబర్స్ మెంట్ లో ప్రభుత్వం పూర్తి ఫీజును చెల్లించడం లేదని దీని వల్ల ప్రముఖ కాలేజీల్లో సీట్లను పొందిన విద్యార్థులు నష్టపోతున్నారని, పేద బీసీలు చదువులకు దూరం అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ప్రస్తుతం ప్రభుత్వం ఒక పరిమితి మేరకు మాత్రమే ఫీజులను తిరిగి చెల్లిస్తోందని దీని వల్ల ఫీజులు ఎక్కువగా ఉండే ప్రముఖ కాలేజీల్లో బీ.సీ విద్యార్థులు చదువుకోలేకపోతున్నారని ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చారు. ప్రతిభ ఉన్నప్పటికీ కేవలం ఫీజులు చెల్లించలేని స్థితి కారణంగా అర్థాతరంగా చదువులకు స్వస్తిచెల్లి వెళ్తున్నారని ఈ పద్దతి మారాలని ఆయన అన్నారు.
బీసీ విద్యార్థులకు పూర్తిగా ఫీజులను కట్టడం వల్ల ప్రభుత్వం పై పడే భారం కూడా మరీ ఎక్కువేంకాదని ఆయన చెప్పారు. 50 నుండి 60 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం ద్వారా వేలాది మంది విద్యార్థులకు మేలు జరుగుతుందని దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఆర్. కృష్ణయ్య విజ్ఞప్తి చేశారు. గతంలో ఇదే అంశంపై ముఖ్యమంత్రి హామీ కూడా ఇచ్చారని అయితే అది ఇంతవరకు అమలు నోచుకోలేదన్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here