టీడీపీకి రాజీనామాకు కూడా సిద్ధం:ఆర్. కృష్ణయ్య

0
57

కాపులను బీసీల్లో చేర్చడం పట్ల బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. కాపులను బీసీల్లో చేర్చడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. కాపులను బీసీల్లో కలపుతూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తీర్మానం చేయడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆయన అన్నారు. కాపులను బీసీలలో కలపడం న్యాయం కాదని దీనిపై అవసరం అయితే న్యాయ పోరాటానికి సిద్ధమని ఆయన ప్రకటించారు. తమ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా వ్యతిరేకిస్తున్నందువల్ల పార్టీకీ, శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని ఆర్.కృష్ణయ్య ప్రకటించారు.
కాపులను బీసీల్లో చేర్చాలనేది పార్టీ విధానం అయినా దాన్ని వ్యతిరేకిస్తానని అన్నారు. పార్టీ కన్నాబీసీల సంక్షేమమే తనకు ముఖ్యమన్నారు. బీసీల సంక్షేమం కోసం రాజీలేని పోరాటం చేస్తానని అన్నారు.



Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here