“పప్పి సార్ ఫౌండేషన్” సత్కార్యం

0
82

నా అనేవారు లేక అంతిమ సంస్కారాలను నోచుకోని శవాలు ఎన్నో… అనాధ శవ దహనం అత్యంత పుణ్యకార్యమని చెప్తుంటారు. దిక్కుమొక్కు లేని వారు కొందరైతే … అందరూ ఉండి కూడా వారికి సమాచారం లేక అనాధ శవాలుగా మిగిలిపోయినవి ఎన్నో… చనిపోయిన తరువాత జరాగాల్సిన కార్యక్రమాలకు సంబంధించి నా అన్న వాళ్లు లేక హీన స్థితిలో మరుభూమికి తరలిపోయే శవాలను నిత్యం చూస్తూనే ఉంటాం… అనాధ శవాల దహనం పుణ్యకార్యం అని అన్ని మతాలు చెప్తున్నప్పటికీ సమాజంలో ఉన్న రకరకాల నమ్మకాల వల్ల అనాధ శవాల విషయంలో ఎవరూ ముందుకు రావడం లేదు. చాలా మంది ఇటువంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మనలో ఉన్న ఈ నమ్మకాల వల్ల చనిపోయిన తరువాత దక్కాల్సిన కనీస గౌరవం దక్కడం లేదు. ఈ క్రమంలో అనాధ శవాల దహనానికి మేమున్నామంటూ పప్పిసార్ ఫౌండేషన్ ముందుకు వచ్చింది. నగరంలోని ఏ ప్రాంతంలో అనాధ శవాలు కనిపించిన తమకు ఫోన్ చేస్తే దహన సంస్కారాలు నిర్వహిస్తామని సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. దిల్ షుఖ్ నగర్ పి అండ్ టి కాలనీకి చెందిన అధ్యాపకుడు పప్పిసార్ గా అందరికి సుపరిచితుడు అయిన వి.ప్రభాకర్ అనుకోని పరిస్థితుల్లో ఎవరికీ కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. కనీసం అతని మృతదేహాన్ని చూసుకునే అవకాశం కూడా అయిన వాళ్లకి లభించలేదు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని తన సోదరుడు పప్పి పేరు మీద ఓ ఫౌండేషన్ ను ఏర్పాటు చేసిన ఆయన సోదరుడు వి.శ్రీనివాస్ అనాధ శవదహనాలు చేయాలని సత్కార్యాన్ని బుజాలకు ఎత్తుకున్నాడు. కొంద మంది మిత్రుల సహకారంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు వి.శ్రీనివాస్ తెలిపాడు. అయిన వాళ్ల కడసారి చూపు దక్కకపోవడం ఎంత బాధాకరమో తాను స్వయంగా అనుభవించానని చెప్తున్న శ్రీనివాస్ ఎవరూ అనాధలుగా దహన సంస్కారాలకు నోచుకోకుండా ఉండకూడదని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఎవరైనా 9391033782,9848214578,9989444033 అనే నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here