హైదరాబాద్ పబ్ లు భద్రమేనా…

0
68

ముంబాయిలోని ఒక పబ్బులో జరిగిన అగ్నిప్రమాదంలో పదుల సంక్షలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడం వల్లే పబ్ లో ఎంజాయి చేయడానికి వచ్చిన వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ముంబాయి అగ్ని ప్రమాదం తరువాత అక్కడి ప్రభుత్వం మేలుకుంది. ప్రమాణాలకు అనుగుణంగా లేని పబ్ లను కూల్చివేస్తోంది.
ముంబాయి సంగతి సరే మరి హైదరాబాద్ పరిస్థితి ఏమటి… ఇక్కడ పబ్ లలో అధికశాతం సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండానే నడుస్తున్నాయి. అగ్నిప్రమాదాలు, ఇతరత్న ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటుగా ఫైర్ ఇంజన్ తిరగడానికి అనువుగా అగ్నిమాపక శాఖ నుండి అనుమతి పత్రాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే హైదరాబాద్ లోని పబ్బుల్లో దాదాపు 80శాతం వాటికి ఎటువంటి భద్రతాపరమైన అనుమతులు లేవని తెలుస్తోంది. పబ్ లలోకి వెళ్లేందుకు ఒకటే మార్గం ఉండడంతో ప్రమాదాలు జరిగిన సమయంలో తొక్కిసలాట జరిగే ఆస్కారం ఉంది. పబ్ నిర్వాహకులు అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ ఎక్కువ శాతం పబ్ లలో అవేవీ కనిపించవు. మంటలు త్వరగా వ్యాపించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా సక్రమంగా లేవు.
బాంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చీబౌలీ,మాదాపూర్ ప్రాంతాల్లో ఎక్కువగా పబ్ లు ఉన్నాయి. ఈ పబ్ లలో ఎక్కువ శాతం రాజకీయంగా పలుకుబడి ఉన్న వారివే కావడంతో పోలీసులు కూడా వీటిపై పెద్దదా దృష్టిపెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ముంబాయిల్ పబ్ లో అగ్నిప్రమాదం తరువాత నగరంలోని పబ్ లపై కూడా పోలీసులు దృష్టిసారించినట్టు తెలుస్తోంది. అయితే పోలీసులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడులు వస్తున్నట్టు సమాచారం.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here