సరూర్ నగర్ చెరువు నుండి వస్తున్న కలుషిత జలాలతో పరిసర కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులతో పాటుగా భయాందోళనలకు గురువుతున్నారు. ఎప్పుడు భారీ వర్షాలు కురిసినా సరూర్ నగర్ చెరువు నుండి వచ్చే జలాలు శారదా నగర్, కోదండరాంనగర్,న్యూ గడ్డిఅన్నారం, పీ అండ్ టి కాలనీ చౌరస్తా, సాయిబాబా మందింర ప్రాంతాలను ముంచెత్తుతూ ఉంటాయి. అయితే ఇటీవల కురుస్తున్న వర్షాలకు నీళ్లతో పాటుగా తెల్లటి నురగ కొన్ని ప్రాంతాలలో కనిపిస్తోంది. ఈ తెల్లటి నురగతో పాటుగా ఘాటైన వాసనతో కూడిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నురగలాంటి నీళ్లు ఈ శారదా నగర్ రోడ్లను ముంచెత్తుతోంది.
ఈ తెల్లటి నురగ కారణంగా తాము తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు స్థానికులు చెప్తున్నారు. వర్షం పడిన ప్రతీసారి తెల్లటి నురగతో కూడిన నీళ్లు రోడ్ల పైకి వచ్చిచేరుతున్నాయని వారు చెప్తున్నారు. సరూర్ నగర్ చెరువు పూర్తిగా కలుషితం కావడం వల్లే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతోందని వారు చెప్పారు. పారిశ్రామిక వ్యర్థాల వల్లే ఈ సమస్య తలెత్తిందని వారంటున్నారు. ఇటువంటి తెల్లటి నురగ గతంలో ఎప్పూడు చూడలేదని వారంటున్నారు.