పీ అండీ టీ కాలనీ వినాయక మండపం వద్ద ఘనంగా కుంకుమార్చన

పర్యావరణానికి పెద్ద పీట వేస్తూ పీ అండ్ టీ కాలనీ సంక్షేమ సంఘం తరపున ఏర్పాటు చేసిన పర్యావరణహిత గణేషుడి వద్ద శుక్రవారం నాడు కుంకుమార్చన ఘనంగా జరిగింది. కాలనీలోని పలువురు మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి కుంకుమార్చన, లలితా సహస్రనామార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సుమారు 100 మందికి పైగా మహిళలు ఈ కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అన్నాదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 1500 మంది అన్నదాన కార్యక్రమానికి హాజరయ్యారు. కాలనీ సంక్షేమ సంఘం వినాయకుడి నిమజ్జన కార్యక్రమం సంక్షేమ సంఘ భవనం ఆవరణలోనే జరుగుతుందని అధ్యక్షుడు పీచర వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి బాణగిరి నాగరాజులు తెలిపారు. శనివారం సాయంత్రం పంచామృతాల్లో ఓలలాడిస్తామని వారు చెప్పారు. శుక్రవారం జరిగిపి ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో కాలనీ సంక్షేమ సంఘం, వినాయక కమిటీ సభ్యులు లంకా లక్ష్మీనారాయణ, ఎం.శ్రీకాంత్ రావు, రాధాకృష్ణ, బీ.వీ.ఎల్.కే.మనోహర్,నర్సింహ్మరాజు,రమేష్ యాదవ్, మున్నా యాదవ్, అశోక్ తదితరలు పాల్గొన్నారు.


p&t colony