పీ అండ్ టీ కాలనీలో మార్గసూచికల ఏర్పాటు

0
65

p&t colony పీ అండ్ టీ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వార్యంలో కాలనీలో రోడ్డు నెంబర్లతో కూడిన సూచికలు (సైన్ బోర్డులు) ఏర్పాటయ్యాయి. కాలనీకి కొత్తగా వచ్చే వారికి ఇంటి నెంబర్లను కనుక్కోవడంలో కలుగుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వీటిని ఏర్పాటు చేసినట్టు సంక్షేమ సంఘం ప్రతినిధులు తెలిపారు. 72వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్బంగా రోడ్డు సూచిలను కాలనీ సంక్షేమ సంఘ బాధ్యులు ప్రారంభించారు.
కాలనీ మొత్తం మీద ఇప్పటివరుక 42 బోర్డులను ఏర్పాటు చేశామని అవసరం అయిన పక్షంలో మరిన్ని బోర్డులు ఏర్పాటు చేస్తామని సంక్షేమ సంఘం అధ్యక్షులు పీచర వేంకటేశ్వరరావు తెలిపారు. గడ్డీఅన్నారం డివిజన్ లోనే ఎక్కువ జనసంచరం ఉండే కాలనీ అయిన తన కాలనీలో ఇంటినెంబర్లను సూచించే బోర్డులు లేకపోవడం వల్ల కొత్తగా కాలనీలోకి వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని దీన్ని దృష్టిలో ఉంచుకుని వీటిని ఏర్పాటు చేయాలని సంక్షేమ సంఘం నిర్ణయించినట్టు చెప్పారు. అన్ని బోర్డులను తమ కాలనీ సభ్యుల చేతులమీదుగానే ప్రారంభించుకుంటున్నామని ఆయన వివరించారు.
చాలా కాలంగా ఇంటినెంబర్లతో కూడిని సూచికలను ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమం ఆలస్యం అయిందని సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి బి.నాగరాజు తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా వీలైనన్ని ఎక్కువ బోర్డులను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకుని బోర్డులను ఏర్పాటు చేశామన్నారు.
వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సూచికలను సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షులు కే.రంగారావు, కాలనీ సీనియర్ సిటిజన్స్ అధ్యక్షలు గోవిందరాజులు, సంఘం ప్రధాన సలహా దారుడు బీ.ఎల్.ఎన్. కుమార్, డి.సుబ్రణ్యేశ్వర రావు, సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి సీహెచ్ ఓం ప్రకాశ్ లు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సంక్షేమ సంఘం ప్రతినిధులు వై.వీ.రవికుమార్, బీ.వి.ఎల్.కే.మనోహర్, ఆది రెడ్డి, ఎ.నరసింహరాజు, శ్రీకాంత్ రావు,కృష్ణా, నిరంజన్, అశోక్,స్యాంకుమార్, అచ్చయ్య లతో పాటుగా లంకా లక్ష్మీనారాయణ, జీ.వీ.ఎన్.రాజు, మహంకాళీ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పీ అండ్ టీ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వార్యంలో కాలనీలో రోడ్డు నెంబర్లతో కూడిన సూచికలు (సైన్ బోర్డులు) ఏర్పాటయ్యాయి.
content/uploads/2018/08/fca0516e-c6d8-4f94-808f-3a4d6bb64f78-300×225.jpg” alt=”” width=”300″ height=”225″ class=”aligncenter size-medium wp-image-9237″ />
దేశానికే ఆదర్శం – తెలంగాణ రాష్ట్రం

Wanna Share it with loved ones?