మానవ మృగాలపై కఠిన చర్యలకు బీజేపీ డిమాండ్

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలోని వ్యభిచార గృహా నిర్వాహకులపై కఠినచర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ బీజేపీ మహిళా విభాగం ధర్నా నిర్వహించింది. వ్యభిచార గృహాల నిర్వాహకుల దుర్మార్గపు చేష్టలపై వస్తున్న వార్తల పట్ల వారు విస్మయం వ్యక్తం చేశారు. దీనిపై మరింత లోతుగా విచారణ జరిపించాలని ఇప్పటికే ఇళ్లకు తాళాలువేసుకుని పారిపోయిన వారిని పట్టుకుని వార వద్ద నుండి అమాయక బాలికలకు విముక్తి కల్పించాలని వారు డిమాండ్ చేశారు. బీజేపీ “భేటీ పడావో-భేటీ బయావో” , మహిళా మోర్చా ఈ ధర్నా కార్యాక్రమాన్ని నిర్వహించాయి.
అమాయకపు పిల్లలను ఎత్తుకుని వచ్చి వారిని బలవంతంగా వ్యభిచారంలోకి దింపడంతో పాటుగా చిన్నారులతో వ్యభిచారం చేస్తూ వారిని చిత్రహింసలకు గురిచేస్తున్న వారిపట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని వారు డిమాండ్ చేశారు. ముక్కుపచ్చలారని పిల్లలకు హార్మోన్ ఇంజక్షన్ లు ఇవ్వడం, చిన్న వయసులోనే వారితో అనైతిక కార్యకలాపాలు చేయించడం దారుణమని ఇటువంటి మానవ మృగాలకు ఎటువంటి శిక్షలు వేసినా తక్కువేనని వారు పేర్కొన్నారు. రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న యాదగిరి గుట్టలో జరిగిన ఘోరాలకు సంబంధించిన వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తుంటే ఒళ్లు గగ్గురు పెడుతోందని మహిళా నాయకురాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతటి దారుణాలు జరుగుతున్నా పోలీసులు ఎందుకు చూస్తూ కూర్చున్నారని వారు ప్రశ్నించారు.
అకృత్యాలకు పాల్పడిన వారు ఇప్పటికే గుట్టను వదిలిపారిపోయారని వారెక్కడ ఉన్నా వెతికి పట్టుకుని కఠిన శిక్షలు వేయడంతోపాటుగా వారి చెరలో ఉన్న చిన్నారులను, అమాయక మహిళలను విడిపించాలని వారు డిమాండ్ చేశారు. పోలీసుల దర్యాప్తు నత్తనడకన సాగుతోందని వారు ఆరోపించారు. నిందితులు పారిపోయేందుకు పోలీసులు ఎందుకు అవకాశం కల్పించారని మహిళానేతలు ప్రశ్నించారు. ప్రభుత్వ ఉదాసీనతకారణంగానే ఇటువంటి దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని వారు మండిపడ్డారు. కేవలం యాదగిరిగుట్టకే ఇటువంటి ఘటనలు పరిమితం కాలేదని రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఇటుంటి దారుణాలు చోటుచేసుకుంటున్నాయని వారు పేర్కొన్నారు. చిన్న పిల్లలను అక్రమ రవాణా చేస్తూ కన్నవారికి కడుపుకోతను రగిలిస్తున్నారని, కొన్ని ప్రాంతాల నుండి చిన్న పిల్లలను కొనుగోలుచేసి తీసుకువస్తున్నట్టు వచ్చిన వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు.
డబ్బుకోసం ఎంతటి నీచానికైనా తెగిస్తున్న ముఠాల ఆటను కట్టించడంతో పాటుగా వారికి సహరిస్తున్న వారిని కూడా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. గతంలో యాదగిరిగుట్టలో వ్యభిచార కేంద్రాలను మూసివేసినా మళ్లీ కొన్నిరోజులకు అవి యాదావిధిగా తెరుచుకున్నాయని వారు చెప్పారు. తక్షణం పోలీసులు ఈ వ్యవహారంపై మరింత లోతుగా విచారణ జరపడంతో పాటుగా రానున్న రోజుల్లో తిరిగి వ్యభిచార గృహాలు తిరిగి తెరవకుండా కఠినంగా వ్యవహారించాలన్నారు.
భేటీ బజావ్-భేటీ పడావ్ రాష్ట్ర కన్వీనర్ గీతా మూర్తి, ఛైర్ పర్సన్ విజయలక్ష్మి,రాణీ సుధాకర్,భారతి, నాగ ప్రమీల, శ్రీధర్ రెడ్డి, మల్లారెడ్డి, సంగీత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
yadagirigutta, prostitution in yadagirigutta, bjp, bjp mahila morcha, bjp women wing, bjp leaders, dharna, bjp dharna in telangana, bjp dharna in yadagirigutta

భారీ ఎన్ కౌంటర్ 14 మంది మావోయిస్టులు మృతి
Yadagirigutta