ఆరు నూరైనా ప్రాజెక్టులు పూర్తి చేస్తాం:కేసీఆర్

తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తికాకండా కొన్ని ముఠాలు ప్రయత్నాలు చేస్తున్నాయని అయితే అటువంటి అడ్డంకులు అన్నింటినీ దాటుకుని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన చర్చలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ మల్లన్న సాగర్ అద్భుతమైన ప్రాజెక్టని చెప్పారు. నిపుణుల సూచనలమేరకు ప్రాజెక్టులను కడుతున్నామన్నారు. సంవత్సరాల తరబడి ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తికాకుండా ఉంటే నష్టపోయేది ప్రజలేఅన్నారు. ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయడానికే కొత్త జీవోను తీసుకుని వచ్చినట్టు కేసీఆర్ వివవించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం 75శాతం ప్రజలు స్వచ్చంధంగా ముందుకు వచ్చి తమ భూములను ఇచ్చారని వారికి గతంలో ఎవరూ ఇవ్వని విధంగా నష్ట పరిహారం చెల్లించామని ముఖ్యమంత్రి చెప్పారు. మల్లన్న సాగర్ నిర్వాసితులను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని ప్రతిపక్షాలు చూస్తున్నాయని సీఎం ఆరోపించారు. కుట్ర ప్రకారం మల్లన్న సాగర్ ను అడ్డుకుంటున్నారని  కేసీఆర్ మండిపడ్డారు. నిర్వాసితులకు గతంలో అందరికంటే ఎక్కువ పరిహారం ఇచ్చినా ఇంకా పరిహారంపై విపక్షాలు లేనిపోని రాద్దాంతం చేస్తున్నారని కేసీఆర్ న్నారు. రైతుల పట్ల తమకే ప్రేమ ఉందన్న చందగా వ్యవహరిస్తున్న విపక్షాలు తమ బుద్ది మార్చుకోవాలని హితవు పలికారు.
kcr
గతంలో రైతులకు 80వేల నష్టపరిహారం ఇస్తే తాము 6లక్షల రూపాయల నష్టపరిహారం అందచేశామన్నారు. అయినా రైతులను రెచ్చగొడుతున్నారని ఇది మంచి పద్దతి కాదన్నారు. రైతులను ఇబ్బందులు పెట్టాలనే ఆలోచన తమకు ఏమాత్రం లేదన్నారు. భూసేకరణ జరక్కండా ప్రపంచంలో ఎక్కడా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికాదని ఆ మాత్రం విషయ పరిజ్ఞానం విపక్షాలకు లేకుండా పోయిందన్నారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్మాణం భూసేకరణ జరక్కుండా పూర్తయిందా అని సీఎం ప్రశ్నించారు. భూసేకరణ త్వరగా పూర్తయి ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తి అయ్యేందుకే తాము భూసేకరణ చట్టంలో మార్పులు తెచ్చామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సలహా మేరకే మార్పులు చేశామని తెలంగాణ తో పాటుగా మరికొన్ని రాష్ట్రాలు కూడా ఇదే తరహా భూసేకరణ చట్టాన్ని తీసుకుని వచ్చినట్టు సీఎం వివరించారు.  ప్రాజెక్టులు సంవత్సరాల తరబడి ఆలస్యం అయితే నష్టపోయేది రైతులే అన్నారు. మల్లన్న సాగర్ శాంకేతిక పరంగా అత్యున్నత డిజైన్ అని ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే గోదావరి జలాలను పూర్తిగా వాడుకునే అవకాశం కలగడంతో పాటుగా ప్రస్తుతం నీళ్లు లేక వెలవెలబోతున్న ప్రాజెక్టులకు జల కళ వస్తుందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *