సమ్మెకు దూరంగా ప్రైవేటు బ్యాంకులు

దేశవ్యాప్తంగా 21 జాతీయ బ్యాంకులతో పాటుగా పాత తరం ప్రైవేటు బ్యాంకులు, కొన్ని అంతర్జాతీయ బ్యాంకులు సమ్మె చెస్తున్నాయి. అయితే కొన్ని ప్రైవేటు బ్యాంకులు మాత్రం సమ్మెకు దూరంగా ఉన్నాయి. దేశంలో పేరెన్నికగన్న ప్రైవేటు బ్యాంకులు సమ్మెకు దూరంగా ఉండడం ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తోంది. ప్రైవేటు బ్యాంకులకు చెందిన యూనియన్ లు సమ్మెకు దిగిన యూనియన్లకు అనుబంధంగా లేకపోవడంతో ఈ బ్యాంకులకు చెందిన ఉద్యోగులు సమ్మెకు దూరంగా ఉన్నారు.
ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లు సమ్మెకు దూరంగా ఉన్నాయి. ఈ ప్రైవేటు బ్యాంకుల కార్యాకలాపాలు యధావిధిగా సాగుతున్నాయి. ప్రైవేటు బ్యాంకులకు చెందిన ఖాతాలు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. ఆ ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండానే బ్యాంకులు పనిచేస్తున్నాయి. తమ బ్యాంకు యధావిధిగా పనిచేస్తాయని తమ ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడం లేదని ఆయా బ్యాంకుల యాజమాన్యాలు ప్రకటించాయి.
ప్రధానంగా జాతీయ బ్యాంకల సమ్మెతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఖాతాదారులు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రైవేటు బ్యాంకులు ప్రధానంగా నగరాలకు మాత్రమే పరిమితం కావడం వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
వేతనాలు పెంచాలంటూ డిమాండ్ చేస్తున్న ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. బ్యాంకు యాజమాన్యాలతో జరిపిన చర్చల్లో ఎటువంటి పురోగతి కనిపించకపోవడంతో బ్యాంకు ఉద్యోగులు సమ్మే బాట పట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా 80వేల మందిదాగా సమ్మెలో పాల్గొంటున్నట్టు ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. 21 ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటుగా విదేశీ బ్యాంకులు, పాత తరం ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులు కూడా ఈ సమ్మెలో పాల్గొంటున్నట్టు ఉద్యోగ సంఘాలు వెళ్లడించాయి. దేశవ్యాప్తంగా దాదాపు 10 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు ఈసమ్మెలో పాల్గొంటున్నారు.
ప్రభుత్వం బ్యాంకు ఉద్యోగల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించడం లేదనేది వారి ఆరోపణ. వేత సవరణ కోసం చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ఎటువంటి ఫలితం లేకుండా పోయిందని వారు చెప్తున్నారు. కంటితుడుపు చర్యగా 2శాతం వేతన సవరణకు ప్రభుత్వం అంగీకరించడం దారుణమని వారంటున్నారు. అన్ని రకాల ధరలు విపరీతంగా పెరిగిపోయిన తరుణంలో కేవలం 2శాతం వేతన సవరణకు అంగీకరించడంపై వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు నిరసనగానే దేశవ్యాప్తంగా 48 గంటల పాట బ్యాంకు ఉద్యోగులు సమ్మె చేస్తున్నట్టు చెప్పారు. బుధవారం ఉదయం 6.00 గంటల నుండి శుక్రవారం ఉదయం 6.00 గంటల వరకు బ్యాంకులు మూతపడనున్నాయి.
బ్యాంకు ఉద్యోగుల జీతాలను పెంచేందుకు యాజమాన్యాలు సిద్ధంగా లేవు. ఇప్పటికీ అనేక జాతీయ బ్యాంకులు నష్టల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇచ్చిన అప్పులు తిరిగి రాక బ్యాంకుల పరిస్థితి ధీనంగా మారింది. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో నిరర్థక ఆస్తులు చేరుకున్నాయి. బ్యాంకులకు లక్షల కోట్ల రూపాయల బకాయిలు తిరిగి రాకపోవడంతో బ్యాంకుల పరిస్థితి దయనీయంగా తయారయింది. బ్యాంకులను ఆదుకోవాలంటే లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ సహాయం అవసరం అయింది.
private banks, private banks of india, indian banks, icici, axis, hdfc , yes bank.

గుడ్డిగా నమ్మి… నగ్న చిత్రాలు తీయించుకుని…
list-nationalised-banks-india.html