ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల లెక్కలు చెప్పాల్సిందే

ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనల లెక్కలు చెప్పాల్సిందేనని ఆయన పర్యనలకు అయిన ఖర్చును బయపెట్టాల్సిందేనని కేంద్ర సమాచార కమిషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు ఎయిర్ ఇండియాకు కమిషన్ ఆదేశాలు జారీచేసింది. 2016-17 సంవత్సరంలో ప్రధాని నరేంద్ర మోడి చేసిన పర్యటనల వివరాలు, వాటికైన ఖర్చును బయటపెట్టాల్సిందిగా సమాచార హక్కు చట్టం ప్రకారం అడిగిన ప్రశ్నకు ఎయిర్ ఇండియా సమాధానం చెప్పలేదు. దినిపై కేంద్ర సమాచార కమిషన్ కు ఫిర్యాదు చేయడంతో కమిషన్ ఈ ఆదేశాలను జారీచేసింది.
ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనకు సంబంధించిన ప్రతీ రూపాయి ప్రభుత్వ ఖజానా నుండి ఖర్చుచేసినందున వాటికి సంబంధించిన వివరాలను సమాచార హక్కు చట్టం కింద అడిగినప్పుడు ఇవ్వాల్సిందేనని కమిషన్ స్పష్టం చేసింది. సమాచారాన్ని ఇవ్వడానికి ఎయిర్ ఇండియా ఇవ్వడానికి నిరాకరించడం సహేతుకంకాదని స్పష్టం చేసింది. ప్రధాని మోదీ వెళ్లిన విదేశీ పర్యటనలకు సంబంధించిన వివరాలు చెప్పాలంటూ లోకేశ్‌ బత్రా అనే వ్యక్తి సహ చట్టం ద్వారా దరఖాస్తు చేశారు. ప్రధాని మోదీ పర్యటించిన ప్రాంతాలు, తేదీలు, విమాన ఖర్చుల వివరాలు చెప్పాలని కోరారు. ‘వాణిజ్య విశ్వాసం, ఎయిరిండియా విశ్వసనీయ సామర్థ్యం’ కింద ఉన్నాయని, ఇలాంటి వాటికి సహ చట్టంలో మినహాయింపు ఉందని ఎయిరిండియా సీపీఐవో తెలిపింది. వీటి ఆధారంగా సమాచారం ఇవ్వలేమంటూ పేర్కొనండపై కమిషన్ అభ్యతరం వ్యక్తం చేసింది. ఎయిర్ ఇండియా వాదనలను కొట్టేవేస్తూ సమాచారాన్ని ఇవ్వడంలో అభ్యంతరం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదని పేర్కొంది.
ప్రధాని నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలపై రాజకీయ విమర్శలు రేగడంతో దీనిపై సమాచారాన్ని ప్రధాని కార్యాలయం బయటికి పొక్కనీయం లేదనే విమర్శలున్నాయి. ప్రధాని విదేశీ పర్యటనలకు సంంబంధించిన వివరాలను వెల్లడిచేయవద్దంటూ ప్రధాని కార్యాలయం నుండి అందిన ఆదేశాల మేరకే తాము సమాచారాన్ని వెల్లడించడం లేదని ఎయిర్ ఇండియా ఈ సమాచారం కోసం ధరఖాస్తు చేసిన వ్యక్తికి చెెప్పడం గమనార్హం.ప్రధాని విదేశీ పర్యటనలకు భారీ మొత్తంలో ఖర్చుచేస్తున్నారని చాలా కాలంగా విమర్శలు వస్తున్నాయి.
narendra modi, prime minister narendra modi, modi foreign tours, modi tours, information act, prime minister office, air india.

రాహుల్ తో పెళ్లి వార్తలపై స్పందిచిన అధితీ సింగ్pm office
Atomic_Energy_