భారత్ దూసుకుపోతోంది:రాష్ట్రపతి

భారతదేశం ప్రగతిపథంలో మరింత వేగంగా దూసుకుని పోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభిలషించారు.68వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు.  ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం సాగుతున్నా భారత దేశం అభివృద్ధిపథంలో దుసుకునిపోతోందని అన్నారు. దీనికి కారణం ప్రజలందరి దీక్షా పట్టుదలలే అన్నారు. భారత దేశ  సార్వభౌమత్వాన్ని ప్రశ్నించే సాహసం ఎవరికీ లేదన్నారు. అవకాశాలను అందిపుచ్చుకుని యువత అన్ని రంగాల్లో ముందుకు సాగాలని అన్నారు. మన దేశ యువతే మనకు అతిపెద్ద ఆస్తి అని వారి తమ కలలను సాకారం చేసుకునే దిశగా  ముందుకు సాగాలన్నారు.
భిన్నత్వంలో ఏకత్వం భారతీయుల గొప్పతనమని దీనికి విఘాతం కలించే చర్యలకు దూరంగా ఉండాలన్నారు. ఆర్థిక ప్రగతికోసం భారత్ పెద్ద నోట్లను రద్దు చేస్తూ పెద్ద నిర్ణయం తీసుకుందని అన్నారు. స్వచ్చభారత్ ను నిర్మించుకునే దిశగా భారత్ వేగంగా దూసుకుని పోతోందన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందని దానితో పాటుగా భారత ప్రపంచంలోనే అంత్యంత విలవలతో కూడిన సమాజం ఉన్న దేశమని రాష్ట్రపతి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *