నేనున్నా… అంటూ ప్రేంనాథ్ గౌడ్ భరోసా…

కరోనా మహమ్మారి నుండి రక్షించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ అనేక మంది జీవినోపాధిని దెబ్బతీసింది. కనీసం నాలుగు వేళ్లు నోట్లోకి పోలేని వారు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రం కాని రాష్ట్రానికి ఉపాధి కోసం వచ్చి అల్లాడుతున్న అభాగ్యులను ఆదుకునేందుకు అనేక మంది ముందుకు వస్తున్నారు. అన్నార్థుల ఆకలి తీరుస్తూ వాళ్లకి మేమున్నామనే భరోసాని కల్పిస్తున్నారు.

    స్థానికంగా పట్టెడు అన్నం కరువై ఇబ్బందులు పడుతున్న వారితో పాటుగా ఉత్తరాది రాష్ట్రాల నుండి ఉపాధి కోసం వచ్చి పనిలేక పస్తులుంటున్న వాళ్లకు కడుపునిండా భోజనం పెడుతున్నారు మాజీ కౌన్సిలర్ ప్రేంనాథ్ గౌడ్. సరూర్ నగర్, పీ అండ్ టీ కాలనీ, కోదండరాంనగర్ పరిసర ప్రాంతాలకు చెందిన వేలాది మందికి నిత్యం కడుపునింపుతున్న ప్రేంనాథ్ గౌడ్ వారికి ఆపత్కాల సమయంలో నేనున్నా అంటూ అడంగా నిలుస్తున్నాడు.

     పేద ప్రజలను ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు పేదలకు కడుపు నింపే పని చేపట్టినట్టు ప్రేంనాథ్ గౌడ్ వివరించారు. స్థానికంగా ఉపాధి లేక అవస్థలు పడుతున్న వారితో పాటుగా ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వలస కూలీలకు నిత్యం భోజన సౌకర్యం కల్పిస్తున్నట్టు ఆయన చెప్పారు. ప్రతీ రోజు కనీసం 500 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు.

   కేవలం భోజనం కల్పించడంమాత్రమే కాకుండా వారి ఆరోగ్య పరిస్థితులను గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని చెప్పారు. భోజన సమయంలో తప్పని సరిగా సమాజిక దూరం పాటించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు.

    కరోనా మహమ్మారి నుండి బయటపడేందుకు కేవలం సామాజిక దూరం పాటించడంతో పాటుగా ప్రతీ ఒక్కరూ ఇంట్లో ఉండడం మినహా మరో మార్గం లేదని ప్రేం నాథ్ గౌడ్ తెలిపారు. దీనికోసం గాను ప్రజలు ఇంట్లో ఉండేలా వారికి అవగాహన కల్పించేందుకు ఆటోల ద్వారా ప్రచారం చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఆటోలు నిత్యం కాలనీల్లో తిరుగుతూ కరోనా మహమ్మారి నుండి రక్షించుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *