ప్రణబ్ ముఖర్జి పై ఊహాగానాలకు తెర

0
68
ప్రణబ్ ముఖర్జి
former Indian president Pranab_Mukherjee

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని జరుగుతున్న ప్రచారానికి తెరపడింది. రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) నిర్వహించిన వేడుకకి ప్రణబ్ ముఖ్యఅతిధిగా హజరవుతారని ప్రకటించిన నాటి నుండి ప్రణబ్ ముఖర్జి రాజకీయ పునః ప్రవేశం పై జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆర్ఎస్ఎస్ నిర్వహించిన కార్యక్రమానికి హాజరుకావడం పై స్వంత పార్టీ కాంగ్రెస్ నుండి కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. పలువురు పార్టీ నేతలు ప్రణబ్ ఆర్ఎస్ఎస్ నిర్వహించిన కార్యక్రమానికి హాజరుకావడంపై స్పందించారు. మతతత్వ ఆర్ఎస్ఎస్ కార్యక్రానికి హాజరుకావడం మంచిదికాదంటూ విమర్శలు చేశారు.
మరో వైపు రానున్న ఎన్నికల్లో బీజేపీ గెలవని పక్షంలో ప్రణబ్ ముఖర్జి ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపడతారంటూ జోరుగా ప్రచారం జరిగింది. రాజకీయ దురంధురిడిగా పేరుగాంచిన ప్రణబ్ ను ప్రధానిగా గద్దెపై కూర్చోబెట్టడానికి ఆర్ఎస్ఎస్ పావులు కదుపుతోందనే ప్రజారం ఊపందుకుంది. ఇటు బీజేపీ మిత్రపక్షం శివసేన కూడా ఇదే అంశాన్ని తెరపైకి తీసుకుని వచ్చింది. ప్రణబ్ ను ప్రధానిగా చేయడం పై ఇతర పార్టీల నుండి పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కావని సర్వ సమ్మతితో ఆయన ప్రధాని పీఠాన్ని అలంకరిస్తారని జరుగుతున్న ప్రచారానికి ప్రణబ్ ముఖర్జీ కుమారై శర్మిష్ఠ ముఖర్జి తెరదించారు. దేశంలోని అత్యున్నత పదవిని నిర్వహించిన తన తండ్రి తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవాకాశం లేదని ఆమె తేల్చిచెప్పారు.
ప్రణబ్ ముఖర్జి రాజకీయ పునరాగమనానికి సంబంధించి శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ట్విట్టర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన శర్మిష్ట తన తండ్రి తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని తేల్చేశారు. ‘మిస్టర్‌ సంజయ్‌ రౌత్‌.. భారత రాష్ట్రపతిగా పదవీ విరమణ పొందినప్పటి నుంచి ఇప్పటి వరకూ నా తండ్రి రాజకీయాల్లో ఎప్పుడూ చురుగ్గా పాల్గొనలేదు. ఇకపై ఆయన రాజకీయ పునఃప్రవేశం ఉండదు.’ అని శర్మిష్ట తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ద
దీనితో ప్రణబ్ ముఖర్జీ పై గత కొద్దిరోజులుగా జరుగుతున్న ప్రచారానికి తెరపడినట్టయింది. రాజకీయ కురువృద్దుడు ప్రణబ్ ముఖర్జీకి గతంలో ప్రధాన మంత్రి పదవి అందినట్టే అంది చేజారిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో చిరకాలం పనిచేసిన ఆయన దేశ రాజకీయాల్లో తనదైన ముద్రను వేశారు. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రణబ్ కు చెప్పుకోదగ్గ స్థాయిలో అభిమానులన్నారు.
Pranab Kumar Mukherjee, President of India, Indian National Congress, Union Finance Minister, Indira Gandhi, Rajya Sabha, Mukherjee, Rashtriya Samajwadi Congress, United Progressive Alliance (UPA) , Manmohan Singh’s government.

గుడ్డిగా నమ్మి… నగ్న చిత్రాలు తీయించుకుని…


ఉత్తర్ ప్రదేశ్ లో ఏంజరుగుతోంది-బీజేపీ కలవరంPranab_Mukherjee

Wanna Share it with loved ones?