ప్రగతీ రీసార్ట్స్ హత్య కేసులో స్నేహితుడే నిందితుడు

ప్రగతీ రీసార్ట్స్ లో జరిగిన దారుణ హత్యకేసులో హతురాలి స్నేనిహితుడే నిందితుడని పోలీసులు అనుమానిస్తున్నారు. బ్యాంకింగ్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థిని శిరీష శంకర్ పల్లిలోని ప్రగతీ రీసార్ట్స్ లో దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు శిరీషను అమె స్నేహితుడు సాయి ప్రసాద్ హత్యచేసినట్టుగా గుర్తించి అతన్ని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శంషాబాద్ డీసీపీ పద్మజారెడ్డి మీడియాకు వివరించారు. ఆమె కథనం ప్రకారం ప్రకారం హతురాలు శిరీషది కొత్తూరు మండలం తిమ్మాపూర్. ఆమె బ్యాంకు పరీక్షల కోసం సన్నద్ధం అవుతోంది. ఇందుకోసం గాను రోజు దిల్ షుఖ్ నగర్ లోని కోచింగ్ సెంటర్ లో శిక్షణ తీసుకుంటూ పరీక్షలకు సన్నద్ధం అవుతోంది.
దిల్ షుఖ్ నగర్ లో కోచింగ్ కోసమని ఇంటినుండి వెళ్లిన శిరీష గురువారం ఇంటికి రాకపోవడంతో అమె తల్లిదండ్రులు ఫోన్ చేశారు. అప్పటికే శిరీష హత్యకు గురికావడంతో పోలీసులు ఫోన్లో విషయాన్ని ఆమె తల్లిదండ్రులకు వివరించారు. ప్రగతీ రీసార్ట్స్ కు చేరుకున్న వారు మృతదేహం తమ కుమారైదేనని గుర్తించారు. తమకు ఆమె స్నేహితుడు సాయి ప్రసాద్ పైనే అనుమానం ఉందని చెప్పడంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు చేశారు. ప్రగతీ రీసార్ట్ లో ఆన్ లైన్ ద్వారా సాయి ప్రాసద్ బుక్ చేసినట్టు పోలీసులు నిర్థారించారు. ఇద్దరూ వచ్చిన తరువాత గంట సేపు మాట్లాడుకున్నారని ఆ తరువాతే ఇద్దరి మధ్యలో గొడవ మొదలై ఆమెను తన వెంట తెచ్చుకున్న కత్తితో సాయి ప్రసాద్ హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారమే సాయి ప్రసాద్ శిరీషను ప్రగతీ రీసార్ట్స్ కు రప్పించి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు.
శిరీషను గతంలోనే సాయి ప్రసాద్ ప్రేమ పేరుతో వేధించడంతో వారి తల్లిదండ్రులు అతన్ని మందలించినట్టు పోలీసులు పేర్కొన్నారు. ప్రగతీ రీసార్ట్స్ లోనూ పెళ్లి విషయంలోనూ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని తనను పెళ్లి చేసుకునేందుకు శిరీష అంగీకరించకపోవడంతోనే సాయిప్రసాద్ దారుణంగా కత్తితో పొడిచి ఆమెను హత్యచేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ హత్య కేసుకు సంబంధించి సాయి ప్రసాద్ ను అరెస్టు చేసినట్టు చెప్పిన పోలీసులు అతనికి ఎవరైనా సహకరించారా లేక ఒక్కడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా అనే విషయం దర్యాప్తులో తేలుతుందని చెప్పారు.
sirisha, sirisha murder , murder in pragathi resorts, resorts,student murder, student murder in pragathi resorts.

ముంబాయ్ సూపర్ కాప్ హిమాన్షు రాయ్ ఆత్మహత్య


అమిత్ షా కాన్వాయ్ పై దాడి