ప్రగతి నివేదన సభ నుండే ఎన్నికల శంఖారావం?

0
87
pragathi nevedana sabha

హైదరాబాద్ శివార్లలోని కొంగర కలాన్ లో సెప్టెంబర్ 2న జరగనున్న ప్రగతి నివేదన సభ నుండే ఎన్నికల సంఘారావాన్ని టీఆర్ఎస్ పార్టీ పూరించే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. ప్రగతి నివేదన సభ ఆదివారం సాయంత్రం జరగనుండగా అదేరోజు మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అవుతోంది. మంత్రి వర్గ సమావేశంలోనే అసెంబ్లీ రద్దుపై తీర్మానం చేసి భహిరంగ సభ ఈ విషయాన్ని ప్రజలకు వివరించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే విషయంపై కూడా ప్రజలకు వివరణ ఇచ్చేందుకు అవకాశం కలుగుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. భారీ భహిరంగ సభకు కొద్ది గంటల ముందు మంత్రి వర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడంతో అసెంబ్లీ రద్దుకు సంబంధించిన ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.
అయితే ప్రస్తుత మంత్రివర్గ సమావేశంలో అసెంబ్లీ రద్దుకు సంబంధించిన నిర్ణయం ఉండదని ఈ సమావేశంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్న తరువాత వాటిని ప్రగతి నివేదన సభలో ప్రజలకు వివరించిన అనంతరం కేవలం అసెంబ్లీ రద్దు కోసమే మరోసారి ప్రత్యేకంగా మంత్రివర్గం సమావేశమై అసెంబ్లీ రద్దుకు గవర్నర్ కు సిఫార్సు చేయనున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఉద్యోగ నియామకాలు, పించన్ల పెంపు, ఉద్యోగులకు డీఏ పెంపు వంటి అంశాలపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తరువాత అసెంబ్లీ రద్దుకోసం మరోసారి మంత్రివర్గం సమావేశమవుతుందని అంటున్నారు. అసెంబ్లీ రద్దుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్న తరువాత సంక్షేమ పథకాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేనందుకున ముందుగానే వివిధ వర్గాలకు లబ్ది చేకూర్చే నిర్ణయాలు తీసుకుని వాటిని ప్రజల్లోకి తీసుకుని వెళ్లిన తరువాత అసెంబ్లీ రద్దు ప్రకటన ఉంటుందని ఆ వర్గాలు చెప్తున్నాయి.
ఏతావాతా సెప్టెంబర్ 10వ తేదీ కల్లా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ రద్దుకు సంబంధించిన స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఖచ్చితంగా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని గట్టి నిర్ణయాన్నే ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్నారని దానికి అనుగణంగానే ఆయన కార్యాచరణను మొదలు పెట్టారని టీఆర్ఎస్ అంతరంగిక వర్గాలు చెప్తున్నాయి. రకరకాల కారణాలను బేరుజు వేసుకున్న తరువాతే ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని దీనిపై ఆయన వెనకడుకు వేసే అవకాశం ఉన్నట్టు కనిపించడంలేదని ఆ వర్గాలు వెల్లడించాయి. సెప్టెంబర్ 10వ తేదీ కల్లా అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టు ప్రకటన చేస్తేనే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ప్రకటన మరీ ఆలస్యం అయిన పక్షంలో పరిణామాలు వేరేరకంగా ఉండే అవకాశం ఉండడంతో దీనిపై ముఖ్యమంత్రి వీలైనంత త్వరలో ఒక ప్రకటన చేస్తారని అంటున్నారు.
ప్రస్తుతం ఎన్నికలకు వెల్లడం ద్వారా 119 సీట్లున్న అసెంబ్లీలో కనీసం 100 సీట్లను గెల్చుకునే అవకాశం ఉందని టీఆర్ఎస్ అధినేత భావిస్తున్నట్టు చెప్తున్నారు. సర్వేలు ఇతరత్రా సేకరించిన సమాచారం ద్వారా ముందస్తుకు వెళ్లడమే ఉత్తమమని గులాబీ దళపతి భావిస్తున్నారు. ఈ మేరకు ఆయన వేగంగా పావులు కదుపుతున్నారు. ప్రగతి నివేదన సభలోనే ఎన్నికల సమరానికి శంఖారావం పూరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నట్టు సమాచారం.
telangana,telangana government,telangana cm, kcr, pragathi nevedana sabha,

ఎందుకీ ముందస్తు… అసలు కారణాలు ఏంటి?


తెలంగాణలో కొత్త జోన్లు ఇవే | new zones in telangana

Wanna Share it with loved ones?