కరెంట్ "షాక్" తప్పదా?

తెలంగాణ లో విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉజ్వల్ డిస్కం హామీ యోజన (ఉదయ్) పేరిట కేంద్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన పథకంలో తెలంగాణ రాష్ట్రం కూడా భాగస్వామ్యం అయింది. ఈ పథకం కింద విద్యుత్ సంస్థలను రుణ భారం నుండి విముక్తి చేయడం ప్రధాన లక్ష్యం. ఈ పథకం కింద విద్యుత్ సంస్థల నష్టాలను తగ్గించడం కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఉత్పత్తి , సరఫరాల వ్యయానికి ఛార్జీలకు మధ్య ఉండే అంతరాన్ని తగ్గించడమే ప్రధాన ఉద్దేశం దీని వల్ల రానున్న రోజుల్లో విద్యుత్ ఛార్జీలు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పెంపు 7.5 నుండి8.0 శాతం దాకా ఉండే అవకాశం ఉంది.
ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల్లో ఇస్తున్న రాయితీలకు సంబంధించిన బకాయిలను కూడా విద్యుత్ సంస్థలకు వెంటనే చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం పేదలకు, రైతులకు ప్రభుత్వం రాయితీలపై విద్యుత్ ను సరఫరా చేస్తోంది. అయితే రాయితీ మొత్తానీ విద్యుత్ సంస్థలకు ప్రభుత్వాలు తిరిగి చెల్లించడంలో విపరీతమైన జాప్యాన్ని చేస్తున్నాయి. దీని వల్ల విద్యుత్ సంస్థలు తీవ్రమైన నష్టాల్లో కూరుకుని పోతున్నాయి. చాలా సార్లు నష్టాల్లో ఉన్న విద్యుత్ సంస్థలు వాటిని బయటపడే పరిస్థితి కనబడడం లేదు. ఉదయ్ పథకంలో చేరిన రాష్ట్రాలు ముందుగా విద్యుత్ సంస్థలకు ఉన్న బకాయిలను చెల్లించాల్సి ఉంటుంది. దీనితోపాటుగా ప్రభుత్వ సంస్థలు వాడుకునే విద్యుత్ బకాయిలను కూడా పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడే విద్యుత్ సంస్థలకు కేంద్రం నుండి నిధులు అందుతాయి. వీటితో పాటుగా విద్యుత్ సంస్థల ఉత్పత్తి ఛార్జీల మధ్య ఉన్న అంతరాలను తగ్గించాలంటే విద్యుత్ ఛార్జీలు పెంచకతప్పని పరిస్థితి.
విద్యుత్ సంస్థలు ఛార్జీలను పెంచడంతో పాటుగా విద్యుత్ ను వృద్ధా కానీకుండా కూడా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. రోడ్లు ఇతర బహిరంగ ప్రదేశాల్లో విధిగా ఎఇడి లైట్లనే వాడాల్సి ఉంటుంది. దీని వల్ల విద్యుత్ ను గణనీయంగా ఆదాచేసుకునే అవకాశం ఉంది. మరో వైపు సరఫరా లోపాల వల్లే విద్యుత్ వృద్ధా కాకుండా కూాడా చర్యలు తీసుకుంటున్నారు. మొత్తం మీద రానున్న రోజుల్లో విద్యుత్ మోత ఖాయంగా కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రాయితీ బకాయిలను చెల్లించడంతో పాటుగా విద్యుత్ నష్ట నివారణకు చర్యలు తీసుకుని విద్యుత్ సంస్థలకు రాయితీ మొత్తాన్ని తానే చెల్లిస్తే తప్ప కరెంటు రేట్లు పెరగడం ఖాయం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *