వైరల్ అవుతున్న దొంగల ముఠా వార్తలు-అబద్దాలు ప్రచారం చేస్తే జైలుకే

0
95
దొంగల ముఠా వార్తల పై పోలీసుల అప్రమత్తం భయపడాల్సింది లేదని భరోసా
andhra police

పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్న ముఠాలు…మనుషులను చంపి మెదళ్లను తింటున్న హంతకులు…దొరికిన కాడికి దోచుకుని హత్యలకు పాల్పడుతున్న దొంగలు… కొద్ది రోజులుగా సామాజిక మాధ్యామాల్లో ఇటువంటి వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇదిగో పులి అంటే అదిగో తోక అనే చందంగా వాట్సప్ … ఫేస్ బుక్ లనిండా ఇవే ముచ్చట్లు… ఇక్కడ దొంగ దొరికాడని కొందరు… అక్కడ మరోకడు దొరికాడని ఇంకొందరు… ఇట్లా సమాజిక మాధ్యమాల్లో అనేక వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనితో ప్రజలు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. చాలా చోట్ల మారణాయిధాలతో రాత్రిళ్లు కాపలాకాస్తున్నారు. దొంగల ముఠా లపై వస్తున్న వార్తలు ప్రజలను తీవ్రంగా భయపెడుతున్నాయి.
ప్రజల భయం కొన్ని చోట్ల అమాయకుల ప్రాణాలపైకి తెస్తోంది. అవసర భయాలతో అనుమానాస్పదంగా కనిపించిన వారిపై దాడులకు దిగుతున్నారు. ముఖ్యంగా మతిస్థిమితం సరిగాలేని వాళ్లు, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ప్రజల చేతుల్లో చావుదెబ్బలు తినాల్సివస్తోంది. ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో ఉపాధికోసం వలస వస్తున్నారు. ముఖ్యంగా బీహార్, ఒరిస్సా, చత్తీస్ ఘడ్ ల నుండి ఉపాధికోసం వచ్చినవారు భాషా సమస్య కారణంగా ప్రజల చేతిలో చావు దెబ్బలు తింటున్నారు. ఒక వైపు సామాజిక మాధ్యామాల్లో భయకంపితులను చేసే విధంగా వస్తున్న వార్తలు దానికి తోడు అదే ఆహార్యం వేష భాషల్లో ఉత్తరాదికి చెందిన వారు కనిపించడంతో అనుమానంతో ప్రజలు వారిపై దాడులకు పాల్పడుతున్నారు. కొన్ని చోట్లు స్థానికుల చేతుల్లో దెబ్బలు తిన్నవారు తీవ్రంగా గాయపడి ఆస్పత్రుల్లో చావుబతుకుల్లో ఉన్నారు. ప్రజల్లో ఉన్న భయాల వల్ల వారు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని దాడులకు తెగబడుతున్నారు. దొంగల ముఠా లుగా భాంవించి అమాయకులపై దాడులకు చేస్తున్నారు.
ప్రజలు ఎవరిపైనా దాడులు చేయవద్దని, వదంతులు నమ్మవద్దని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాల్లో ఏమాత్రం వాస్తవం లేదని వారు చెప్తున్నారు. కొన్ని చోట్ల ఏకంగా పోలీసుల పేర్లతోనే సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడంపై దృష్టిసారించిన పోలీసులు అటువంటి ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటున్నారు. ప్రజలు వధంతులను నమ్మవద్దని ప్రచారం చేస్తున్న పోలీసులు ఎవరిపైనానా అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు. ప్రజలు ఎవరూ ఎవరిపైనా దాడులు చేయవద్దని దీని వల్ల కేసుల్లో ఇరుక్కోవాల్సి వస్తుందంటున్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచిస్తున్న పోలీసులు ఎట్టిపరిస్థితుల్లోనూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దంటున్నారు.
ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో వదంతులను సృష్టించేవారితోపాటుగా వాటిని ప్రచారం చేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. వాట్సప్ ప్రచారాలను గుడ్డిగా ఇతరులకు పంపినా నేరమేనని అటుంటి పనిచేసినవారంతా చిక్కుల్లో పడాల్సి వస్తుందని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. నిజానిజాలు తెలుసుకున్న తరువాతే ఏదైనా సమాచారాన్ని ఇతరులతో పంచుకోవాలని వారు సూచిస్తున్నారు. ఇటువంటి అవాస్తవ సమాచారాన్ని సృష్టించి ప్రజల్లో అలజడి రేపుతున్న వారిపై కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్టు పోలీసులు తెలిపారు. రెండు తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఇటువంటి ప్రచారాలు జరగడం అమాయకులపై దాడులు జరుగుతున్న నేపధ్యంలో రెండు రాష్ట్రాల పోలీసులు అప్రమత్తం అయ్యారు.

నగరంలో ఆధునిక బస్ షెల్టర్ లు


ఆఖరి చూపూ దక్కడం లేదు… యద్దనపూడి అభిమానుల ఆవేదన
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ టీవీ యాంకర్ లోబో
police warning to whats up group admins

Wanna Share it with loved ones?