పోలవరం నిర్మాణం ఆపాలంటూ కేంద్రానికి నవీన్ పట్నాయక్ లేఖ

0
118
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాల్సిందిగా ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కేంద్రానికి లేఖరాశారు.
polavaram project

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంక ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు మరో అవరోధం ఎదురైంది. తమ రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగే విధంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టును ఆపాలంటూ ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కేంద్రానికి లేఖరాశారు. పోలవరం వల్ల తమ రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు మునిగిపోతాయని దినికి సంబంధించిన పునరావాసం, ఆర్థిక సహాయం వంటి అంశాలపై స్పష్టత లేనందును పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపివేయాలంటూ నవీన్ పట్నాయక్ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్థన్ కు లేఖ రాశారు.
ముంపు ముప్పును ఎదుర్కొంటున్న మల్కన్ గిరి ప్రాంతంలో ప్రజాభిప్రాయం తీసుకోకుండా ప్రాజెక్టు పనులను ఎట్లా చేపడతారని నవీన్ పట్నాయక్ ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడికి రెండు సార్లు లేఖరాసినా ప్రయోజనం లేకుండా పోయిందని నవీన్ పట్నాయక్ పేర్కొన్నారు. శబరి, సీలేరు నదీజలాల వాటాల విషయం ఇంతవరకు తేలలేదని ఆయన చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గోదావరి నదీ జలాల ట్రైబునల్ నిబంధనల్ని అతిక్రమించి నిర్మిస్తున్నారేది ఆయన వాదన.
పోలవరం విషయంలో ఒడిస్సా వాదనలు ఎట్లా ఉన్నా ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపాలంటే కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే అది ఖచ్చితంగా రాజకీయ వివాదాన్ని రేపడం ఖాయం. ఇప్పటికే ఏపీని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని, సవతి తల్లి ప్రేమ చూపుతోందంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పై తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదా విషయంలో ఏర్పడిన విభేదాలతో కేంద్ర ప్రభుత్వం నుండి బయటికి వచ్చిన తెలుగుదేశం అధికార బీజేపీ పై విమర్శల తీవ్రతను పెంచింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం పై నిప్పులు చెరుగుతున్నారు. అవకాశం వచ్చిన ప్రతీ చోట కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం-బీజేపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఒరిస్సా ముఖ్యమంత్రి లేఖను అడ్డుపెట్టుకుని పోలవరం ప్రాజెక్టుపనులను నిలపుదల చేస్తుందా అనేది ఆశక్తికరంగా మారింది.
సాంకేతికంగా చూస్తే పక్క రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని వివాదాలు పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పై ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇరు రాష్ట్రాల మధ్య మద్యవర్తిత్వం వహించే అవకాశాలు ఏ కోశానా కనిపించడం లేదు. రెండు రాష్ట్రల్లోనూ బీజేపీ రాజకీయ ప్రత్యర్థులే అధికారంలో ఉన్నారు. పోలవరం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతపట్టుదలగా ఉందనే సంగతి కేంద్రానికి తెలియంది కాదు. అటు ఒరిస్సాలోనూ ఇబ్బందులు కలక్కుండా వ్యవహరించాల్సిన పరిస్థితి కేంద్రంపై ఉంది.
దేశంలోని అతి భారీ ప్రాజెక్టుల్లో ఒకటిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టు పూర్తయితే విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల సాగునీటి అవసరాలే కాక, విశాఖ మహానగరం తాగునీటి సమస్యలు కూడా తీరతాయి. దీనితో పాటుగా విశాఖపట్నం ప్రాంతంలోని పారిశ్రమల నీటి అవసరాలు కూడా ఈ ప్రాజెక్టు ద్వారా తీర్చాలనే లక్ష్యంతో దీన్ని నిర్మిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన పోలవరం ఏపీతో పాటుగా చత్తీస్ ఘడ్, ఒరిస్సాల్లోనూ విస్తరించి ఉంది.
Polavaram Project, multi-purpose irrigation project, Godavari River , West Godavari District, East Godavari District, Andhra Pradesh state, reservoir, Chhattisgarh , Odisha.

తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకుపోతోంది:కేసీఆర్


ఉత్తర్ ప్రదేశ్ లో ఏంజరుగుతోంది-బీజేపీ కలవరం
Polavaram_Project

Wanna Share it with loved ones?