ఫోన్ పేలి బాలుడి మృతి

0
70

    మాట్లాడుతున్న ఫోన్ పేలిపోవడంతో బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన తమిళనాడులోని విల్లుపురంలో జరిగింది. బెంగళూరుకు చెందిన 15 సంవత్సరాల బాలుడు తల్లిదండ్రులతో కలిసి విల్లుపురంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. అక్కడ మేడపై నిలబడి ఫోన్ మాట్లాడుతుండగా ఫోన్ ఒక్కసారిగా పేలిపోయి మంటలు చెలరేగాయి. ఫోన్ నుండి మంటల బాలుడు వేసుకున్న బట్టలకు అంటుకోవడంతో అతనికి యాభై శాతం గాయాలయ్యాయి. బాలుడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.  బాలుడు వాడుతున్నది సామ్ సంగ్ ఫోన్ కావడంతో ఇటీవల వార్తల్లోకి వచ్చిన సామ్ సంగ్ నోట్ బ్యాటరీయా అని పోలీసులు పరిశీలిస్తున్నారు. బాలుడు ఇంటి మిద్దెపై నిలబడి మాట్లాడుతుండడంతో సమీపంలో ఉన్న హై టెన్షన్ వైర్ల వల్ల ఎలెక్ట్రోమాగ్నెటిక్‌ రేడియేషన్‌ వల్ల ఫోన్ పేలిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఫోన్ ను కొనుగోలు చేసి ఏడాది అవుతోందని మృతుడి తల్లిదండ్రులు చెప్తున్నారు. మాట్లాడుతున్న ఫోన్ పేలిపోవడంతో బాలుడు మృత్యవాత పడడం స్థానికంగా కలకలం సృష్టించింది. సెలవలకు బంధువులతో సరదాగా గడుపుదామని వచ్చిన బాలుడు విగత జీవిగా మారడం తీవ్ర విషాదాన్ని నింపింది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here