పేట్ల బురుజు ఆస్పత్రికి ఆధునిక సౌకర్యాలు

0
80
పేట్ల బురుజు ఆస్పత్రి
minister lakshma reddy in petlaburj hospiral

తెలంగాణ రాష్ట్రంలోనే అత్య‌ధిక కాన్పులు జ‌రిగే పేట్ల బురుజు ఆస్పత్రిలో ఇన్ ఫ‌ర్టిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామ‌ని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ‌శాఖ మంత్రి డాక్ట‌ర్ సి ల‌క్ష్మారెడ్డి చెప్పారు. ఇప్ప‌టికే అదే హాస్పిట‌ల్‌ ఆవ‌ర‌ణ‌లో కేటాయించిన విభాగాన్నిసైతం మంత్రి చూశారు. దేశంలోనే మొట్ట‌మొద‌టి సారిగా ప్ర‌భుత్వ వైద్య రంగంలో గాంధీలో సంతాన సాఫ‌ల్య (ప‌ర్టిలిటీ) కేంద్రాన్ని ఏర్పాటు చేశామ‌ని చెప్పారు. గాంధీ సంతాన సాఫ‌ల్య కేంద్రం బాగా నడుస్తున్న‌దని, త్వ‌ర‌లో పేట్ల బురుజు లోనూ ఇన్ ఫ‌ర్టిలిటీ కేంద్రాన్ని ప్రారంభిస్తామ‌న్నారు. దేశంలో, రాష్ట్రంలో సంతాన స‌మ‌స్య‌లతో 10శాతానికి పైగా జంట‌లు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని చెప్పారు. అలాంటి వాళ్ళ‌కి సంతాన సాఫ‌ల్య కేంద్రం ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంద‌ని చెప్పారు.
హాస్పిట‌ల్ లోని వివిధ విభాగాల‌ను ప‌రిశీలించారు. ముఖ్యంగా ఎంఐసియూని ప‌రిశీలించారు. అలాగే న‌వ‌జాత శిశు విభాగాన్ని, వివిధ వార్డుల‌ని ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఓపీ, ఐపీ విభాగాల్లో రోగుల‌తో స్వ‌యంగా మంత్రి మాట్లాడారు. వాళ్ళ‌కి అందుతున్న వైద్యాన్ని ఎలా ఉందంటూ అడిగారు. ఏయే ఊళ్ళ నుంచి వ‌చ్చారు. ఏయే స‌మ‌స్య‌ల‌తో వ‌చ్చారు? ప‌్ర‌స్తుతం అందుతున్న వైద్యం ఎలా ఉంది? ఇంకా స‌మ‌స్య‌లేమైనా ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం హాస్పిట‌ల్ అధికారులతో స‌మావేశ‌మ‌య్యారు.
పేట్ల బురుజులో ప్ర‌స్తుతం ఉన్న లేబ‌ర్ రూమ్స్‌ని రెట్టింపు చేస్తామ‌న్నారు. కెసిఆర్ కిట్ల ప‌థ‌కం అమ‌లులోకి వ‌చ్చాక పేట్ల బురుజులో ప్ర‌సూతిల సంఖ్య బాగా పెరిగింద‌ని, అందుకు త‌గ్గ‌ట్లుగా లేబ‌ర్ రూమ్స్ కూడా అవ‌స‌ర‌మ‌వుతున్నాయ‌న్నారు. ఇక ఎంఐసియూలో కూడా ప్ర‌స్తుతం ఉన్న 8 ప‌డ‌క‌ల‌ను 16 ప‌డ‌కల‌కు పెంచుతామ‌న్నారు. దీంతో పేట్ల బురుజులో ఎంఐసియూ సేవ‌లు కూడా విస్తృతం అవుతాయ‌న్నారు.
ఇక అప్పుడే పుట్టిన పిల్ల‌ల్లో వ‌చ్చే స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి న‌వ‌జాత శిశు సంర‌క్ష‌ణ కేంద్రం (ఎస్ఎన్‌సియూ)లో అద‌నంగా మ‌రో వార్డుని పెంచ‌డానికి నిర్ణ‌యించామ‌న్నారు మంత్రి ల‌క్ష్మారెడ్డి. ఆ వార్డుని మంత్రి ప‌రిశీలించారు. అలాగే న‌వ జాత శిశు సంర‌క్ష‌ణ లో దేశంలోనే మ‌న రాష్ట్రం నెంబ‌ర్ వ‌న్ స్థానంలో ఉంద‌న్నారు. మ‌రిన్ని స‌దుపాయాలు క‌ల్పిస్తే, న‌వ‌జాత శిశువుల్లో వ‌చ్చే స‌మ‌స్య‌ల మీద ప‌రిశోధ‌న‌ల‌ను కూడా చేయ‌వ‌చ్చ‌ని, ఆ దిశ‌గా ప్ర‌భుత్వం ప‌ని చేస్తున్న‌ద‌ని మంత్రి వివ‌రించారు.
అంతకు ముందు మంత్రి ఉస్మానియా ద‌వాఖానాకు వెళ్ళారు. అక్క‌డ ద‌వాఖానాలో రోగుల‌తో మాట్లాడుతూ, స‌మ‌స్య‌లు తెలుసుకుంటూ, ద‌వాఖాను ప‌రిశీలించారు. ఆధునీక‌ర‌ణ ప‌నులు త‌క్ష‌ణ‌మే చేప‌ట్టాల‌ని ఆదేశించారు.ఉస్మానియాలోనూ ప్ర‌స్తుతం ఉన్న వ‌స‌తుల ఆధునీక‌ర‌ణ‌కు మంత్రి ల‌క్ష్మారెడ్డి అదేశించారు. మంచినీటి లీకేజీలు, డోర్‌ల‌ మ‌ర‌మ్మ‌తులు చేయాల‌న్నారు. లిఫ్ట్ మ‌ర‌మ్మ‌తుల‌ను వేగంగా పూర్తి చేసి సాధ్య‌మైనంత త్వ‌ర‌లోనే రోగుల‌కు అందుబాటులోకి తేవాల‌ని ఆదేశించారు.
old city, hyderabad, hyderabad old city, petlaburj hospital, petlaburj , petlaburj maternity hospital, osmania, osmania hospital, osmania hospital hyderabad, health minister, health minister lakshma reddy, lakshma reddy, lakshma reddy health minister, telangana, health.

కర్ణాటకలో పోరాడి గెల్చిన కాంగ్రెస్


telangana-eamcet
Osmania_General_Hospital

Wanna Share it with loved ones?