ఓ నిర్మాత అసభ్యంగా మాట్లాడాడు: ఆర్ఎక్స్ 100 హీరోయిన్

0
103
పాయల్ రాజ్ పుత్

payal rajput about casting couch చిత్ర పరిశ్రమలో లైగింక వేధింపులకు సంబంధించి మరోసారి చర్చకు తెరతీశారు “ఆర్ఎక్స్100” హీరోయిన్ పాయల్ రాజు్పుత్. తనను ఓ నిర్మాత లైంగికంగా వేధించాడని, తాను చెప్పినట్టు చేస్తేనే తన సినిమాలో నటించే అవకాశం ఇస్తానన్నాడని ఆమె మీడియాకు చెప్పారు. “ఆర్ఎక్స్100” చిత్రం ద్వారా ప్రచారంలోకి వచ్చిన ఈ నటిమణిని సదరు నిర్మాత తన సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పాడట. అయితే సినిమాలో అవకాశం కావాలంటే ఖచ్చితంగా తాను చెప్పినట్టు చేయాలంటూ షరతు విధించాడని ఆమె చెప్తోంది. తొలి చిత్రంలోనే మంచి హిట్ ను అందుకున్న పంజాబ్ కు చెందిన ఈ అమ్మాయి సినిమాలో అవకాశాలు కావాలంటే దిగజారాల్సిందే అన్నట్టుగా పరిశ్రమలో కొందరు వ్యవహరిస్తున్నారని చెప్పారు.
తాను నటించిన తొలిచిత్రం విజయం సాధించడంతో తనకు తెలుగులో మంచి అవకాశాలు వస్తాయని భావించానని అయితే సదరు నిర్మాత వ్యవహారం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. తన సినిమాలో అవకాశం అంటూ తనను సంప్రదించిన నిర్మాత తనకు కావాల్సింది ఇవ్వాల్సిందేనని ఖరాఖండిగా చెప్పాడని ఇట్లాంటివన్నీ ఇక్కడ మామూలేనని, రాజీపడక తప్పదని కూడా చెప్పడాని ఆమె వెల్లడించింది. తనకు సినిమాలో అవకాశాలు రాకున్నా ఫరావాలేదు కానీ ఇటువంటి వ్యవహారాలను సహించనని, అవకాశాల కోసం దిగజారాల్సిన అవసరం లేదని అతనికి గట్టి చెప్పినట్టు ఆమె వెల్లడించారు.
సినిమాలో పాత్రకు అనుగుణంగా గ్లామర్ గా కనిపిస్తాను తప్ప నిజజీవితంలో కూడా అట్లాగే ఉంటారనుకోవడం తప్పని అన్నారు. తన తొలి సినిమా “ఆర్ఎక్స్ 100” లో కొన్ని ముద్దుసీన్లలో నటించినంత మాత్రనా కనిపించిన ప్రతీ వాళ్లకి ముద్దులు పెడతానని కాదని అన్నారు. దిగజారుడు పనులతో సిినిమాల్లో అవకాశాలు పొందాల్సిన అవసరం లేదని తాను ట్యాలెంట్ ను నమ్ముకుని సినిమా రంగంలోకి అడుపెట్టానని చెప్పారు. సినిమా రంగంలో ప్రతీ ఒక్కరూ చెడ్డవాళ్లే ఉంటారని కాదని అయితే చెడ్డవాళ్లు కూడా ఉన్నారని చెప్పడమే తన ఉద్దేశమని అన్నారు. సినిమా రంగంలోకి కొత్తగా వచ్చే నటీమణులు క్యాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొంటున్నారని ఇటీవల పరిశ్రమలలో భారీగా చర్చ జరిగిన సంగతి తెలిసిందే. సినిమా రంగంలో కొంత మంది హీరోయిన్లను లైంగింకంగా వేధింపులకు గురిచేస్తున్నారనే విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది.
‘సప్నో సే భరే నైనా’ అనే హిందీ సీరియల్ ద్వారా వెలుగులోకి వచ్చిన రాజ్ పుత్ కొద్దికాలానికే ప్రేక్షకుల మన్నలను అందుకున్నారు. 2017లో ‘చన్నా మేరేయా’ అనే పంజాబీ చిత్రంలో హీరోయిన్ గా పరిచయం అయిన అమె అక్కడి నుండి తెలుగు సినిమా “ఆర్ఎక్స్ 100″లో అవకాశం దక్కించుకున్నారు. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో తెలుగులోను ఆమె పాపులర్ అయ్యారు.
Payal Rajput, rx 100 heroine, payal rajput about casting couch , Sapnon Se Bhare Naina ,Aakhir Bahu Bhi Toh Beti Hee Hai,Gustakh Dil,Mahakumbh ,Yeh Hai Aashiqui , Pyaar Tune Kya Kiya,Yeh Hai Aashiqui ,Darr Sabko Lagta Hai.

ఆసియా క్రీడల్లో భారత్ కు మరో స్వర్ణం


కేరళ వరదలకు కారణం- దేవుడి శాపమా..? మనిషి పాపమా…?

Wanna Share it with loved ones?