అజ్ఞాతవాసీ సినిమా రివ్యూ..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అజ్ఞాతవాసి ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. భారీ అంచానాల మధ్య విడుదలయిన ఈ చిత్రం విడుదల అవుతూనే అనేక రికార్డులను బద్దలు కొట్టింది. గతంలో ఎన్నడూ లేలన్ని ధియేటర్లలో అజ్ఞాతవాసిని విడుదల చేశారు. ఈ చిత్రానికి తివిక్రమ్ దర్శకత్వం వహించారు. గతంలో పవన్ కళ్యాణ్-తివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు భారీ విజయాన్ని సాధించడంతో ఈ సినిమా పై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. సంక్రాతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధిస్తుందని పవన్ అభిమానులు ఆశిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసిన ఈ చిత్రం వారిని ఒకింత నిరాశకే గురిచేసింది. అంచానాలు భారీగా పెరిగిపోవడంతో ఆ స్థాయిలో సినిమా లేదని అంటున్నారు. కథా కథనంలో లోపాలు సినిమాకు మైనస్ పాయింట్లుగా మారాయని అభిప్రాయపడుతున్నారు. త్రివిక్రమ్ మార్క్ హాస్యం, డైలాగులు పండినప్పటికీ సినిమా కథనంలో ఎక్కడో లోపం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. సినిమా చూస్తున్నంత సేపు అత్తారింటికి దారేదీ గూర్తుకు తెచ్చేదిగా ఉందని ప్రేక్షకులు చెప్తున్నారు.
పవన్ కళ్యాణ్ అద్భుతంగా నటించారని అభిమానులు చెప్తున్నారు. గతంలో ఎన్నడూ చూడని లొకేషన్లు చిత్రానికి హైలెట్ గా నిల్చాయి. కెమేరాతో పాటుగా ప్రతీ ప్రేమ్ లో రిచ్ నెస్ కనిపించిందని అంటున్నారు. మొత్తానికి ఈ చిత్రం యావరేజ్ అని ప్రేక్షకులు తేలుస్తున్నారు.