కేసీఆర్ ఓ నియంత:వీహెచ్

0
65

కేసీఆర్ నియంత మాదిరిగా వ్యవహరిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు మండిపడ్డారు. చంచల్ గూడ జైల్లో ఉన్న ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణమాదిగను పరామర్శించిన తరువాత వీహెచ్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ పరిపాలన దారుణంగా ఉందన్నారు. తనకు గులాంగిరి చేసిన వారిని అందలం ఎక్కిస్తూ వ్యతిరేకించిన వాళ్లను జైళ్లకు పంపుతున్నాడని వీహెచ్ ఆరోపించారు. ప్రజల కోసం పోరాటం చేస్తున్న వారిని జైల్లో పెట్టిన కేసీఆర్ కు ప్రజలే సరైన గుణపాఠం చెప్తారని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రముఖ సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా వీహెచ్ మండిపడ్డారు. తెలంగాణ ఉధ్యమ సమయంలో కేసీఆర్ ను తప్పుబట్టన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆయన్ను వెనకేసుకుని రావడంలో ఆంతర్యం ఏమటని ఆయన ప్రశ్నించారు. అటు చంద్రబాబుకు, ఇటు కేసీఆర్ కు పవన్ కళ్యాణ్ తొత్తుగా వ్యవహరిస్తున్నారని వీ.హనుమంతరావు ఆరోపించారు. ఇద్దరు ముఖ్యమంత్రులతో లోపాయకారి ఒప్పందానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రభుత్వాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పవన్ అసలు రాజకీయ నాయకుడే కాదన్నారు. సినిమా వేషాలు వేసే ఆయనకు ప్రజల సమస్యలు తెలియవని, దళితులంటేనే తెలియని పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు ఎట్లా అవుతాడని ప్రశ్నించారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here