తెలంగాణలో జనసేన పాత్ర ఏమిటి?|Janasena in telangana

0
76
తెలంగాణలో జనసేన
తెలంగాణలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్.

తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్ర ప్రారంభమైంది. దానితో పాటుగానే పవన్ పై విమర్శల హోరు కూడా పెరిగింది. తెలంగాణా ఏర్పాటును వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ ముందుగా తెలంగాణా ప్రజలకు క్షమాపణలు చెప్పినతరువాత రాష్ట్రంలో పర్యటించాలంటూ తెలంగాణ సామాజిక ఉధ్యమకారలు కొంతమంది వ్యాఖ్యానించగా పవన్ కళ్యాణ్ పై కాంగ్రెస్ పార్టీ విమర్శలకు దిగింది. పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆయనపై విమర్శల జోరును పెంచారు. టీఆర్ఎస్ తో పవన్ కళ్యాణ్ రహస్య అవగాహనకు వచ్చారని వారు విమర్శిస్తున్నారు. కేసీఆర్ ను కలిసిన తరువాతే తెలంగాణలో పవన్ కళ్యాణ్ పాదయాత్రను చేస్తున్నారని దీనివెనుక కేసీఆర్-పవన్ కళ్యాణ్ ల రహస్య ఎజెండా ఉందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ యాత్రపై టీఆర్ఎస్ ఆచీతూచి స్పందిస్తోంది. ఆయనను ఇప్పటికీ తాము పూర్తిగా రాజకీయ నాయకుడిగా చూడడంలేదని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ను సినిమా హీరోగానే తాము చూస్తున్నామంటూ ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసల జల్లు కురిపించిన పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసే అవసరం టీఆర్ఎస్ కు లేకుండా పోయింది. ఇటు బీజేపీ నేతలు కూడా జనసేన అధినేతపై పెద్దగా విమర్శలకు దిగడం లేదు. మొత్తం మీద ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసింది.
తొలిరోజున మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ రాజకీయ విమర్శలకు దిగలేదు. తాను చెప్పట్టబోయే కార్యక్రమాలను వివరించడానికే పరిమితం అయిన ఆయన విమర్శల జోలికి వెళ్లలేదు. ముఖ్యమంత్రిని కలవడంలో ఎటువంటి రాజకీయం లేదని చెప్పిన ఆయన సీఎంను కలిస్తే తప్పేంటని ప్రశ్నించడంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ వల్లనే జరిగిందని ప్రజలు భావిస్తున్నాంటూ చెప్పడం ద్వారా టీఆర్ఎస్ పై తన వైఖరిని చెప్పకనే చెప్పినట్టయింది.
తెలంగాణలో జనసేనకు బలం ఉందని గట్టిగా ఉందని నమ్ముతున్న పవన్ కళ్యాణ్ ఇక్కడ కూడా తన సత్తాను చాటే ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన పార్టీ కేవలం ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితం అవుతోందనే విమర్శల నేపధ్యంలో తెలంగాణను పార్టీ విస్తరణపై దృష్టి పెట్టిన ఆయన ఆదిశగా ముందుకు వెళ్తున్నారు. ప్రజాగాయకుడు గద్దర్ జనసేనతో కలిసి వస్తున్నట్టు గతంలో ప్రచారం జరిగినా అది ఒట్టిదేనని తేలిపోయినట్టుగానే కనిపిస్తోంది.రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో పవన్ కీలక పాత్ర పోషిస్తారో… ఆటలో అరటిపండుగానే మిగిలిపోతారో…
Pawan kalyan, janasena, telangana,janasena in telangana,pavan kalyan, janasena in telangana state, pawan kalyan tour in telangana, telangana headlines, telangana latest news, telangana news, telangana latest, telangana janasena party, pawan kalyan tour in telangana state, pawan kalyan fans, telangana latest news, telangana.
పవన్ కళ్యాణ్
janasena
janasena-support
Jana_Sena_Party
Pawan_Kalyan
pawan kalyan wife

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here