పంచాయతీ కార్యదర్శి పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

0
17
panchayat secretary posts notification

panchayat secretary posts notification జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు పంచాయతీరాజ్ శాఖ ప్రకటన జారీ చేసింది. ఇందులో మొత్తం 9,355 పోస్టులున్నాయి. సెప్టెంబర్ 3 నుండి 10తేదీ వరకు దరఖాస్తులను ఆన్ లైన్ లో స్వీకరిస్తారు. http://tspsri.cgg.gov.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి కనీస విద్యార్హత డిగ్రీ కాగా వయోపరిమితి 18-39 సంవత్సరాలు. ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అయిదు సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంది. వికలాంగులకు 10 సంవత్సరాలు వయోపరిమితి సడలింపు ఉంది.
ధరఖాస్తు దారులు రు.500 ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ,ఎస్టీ,బీసీలు రు.250 రూపాయల రుసుము చెల్లించాలి. ఫీజు చెల్లించడానికి ఆఖరి తేదీ సెప్టెంబర్ 10వ తారీకు. ఈ పోస్టులకు ప్రవేశపరీక్షను నిర్వహిస్తారు. ఒక్కోటి 150 మార్కులకు గాను రెండు పేపర్లు ఉంటాయి. రెండూ అబ్జెట్టివ్ తరహాలోనే పరీక్ష జరుగుతుంది. మొదటి పేపర్ లో జనరల్ నాలేడ్జీతో పాటుగా జనరల్ ఎబిలిటీలో ప్రశ్నలుంటాయి. రెండవ పేపర్ లో మాత్రం పంచాయతీరాజ్ చట్టం,తెలంగాణ చరిత్ర, సంస్కృతి, తెలంగాణ భౌగోళిక స్వరూపం, ప్రభుత్వ పథకాలు, ఆర్థిక వ్యవస్థ, స్థానిక సంస్థల పరిపాలన, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన ప్రశ్నలుంటాయి.
పరీక్షల్లో నెగిటివ్ మార్క్ ఉంది. ఒక్కో తప్పు సమాధానానికి మూడో వంతు మార్క్ ను కట్ చేస్తారు.
telangana, telangana panchayati raj, panchayati raj exam, panchayat secretary posts notification.

Wanna Share it with loved ones?