పద్మ అవార్డుల పేరుతో పకడ్బందీ మోసం…

ప్రతిష్టాత్మక పద్మా అవార్డు ఇప్పిస్తానంటూ భారీగా డబ్బులు దండుకున్న వ్యవహారం నెల్లురు జిల్లాలో బయటపడింది. ఈ వ్యవహారంలో ఓ పోలీసు అధికారి పాత్ర కూడు ఉన్నట్టు తెలింది.కోట్ల రూపాయలు చేతులు మారిన ఈ కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం నెల్లురు కు చెందిన వడ్లమూడి రమణయ్య నాయుడు రొయ్యల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఇతనికి కాకర్ల ప్రసన్న అనే మహిళ ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయింది. ప్రసన్న భర్త కాకర్ల శేషరావు పోలీసు శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల్లోనే వీరు కుటుంబ స్నేహితులుగా మారారు. ఈ క్రమంలో గుంటూరు జిల్లాలో విధులు నిర్వహిస్తున్న కాకర్ల శేషారావు సహాయంతో పలు భూములును రమణయ్య కొనుగోలు చేశారు. వీరిద్దర మధ్య భారీగా ఆర్థిక లావాదేవీలున్నాయి. రొయ్యల వ్యాపారంలో భారీగా సంపాదించిన రమణయ్య నాయుడికి తనకు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పరిచయాల ద్వారా సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పోరేషన్ లో పదవులు ఇప్పిస్తానంటూ శేషారావు, ఆయన భార్య పలు దఫాలుగా డబ్బులు తీసుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు నాలుగు కోట్ల రూపాయలు పలు దఫాలుగా వివిద కారణాలతో రమణయ్య వద్ద నుండి వీరు తీసుకున్నరనే ఆరోపణలు ఉన్నాయి.
వీరితో పాటుగా రమణయ్య తనకు పరిచయం ఉన్నవారిని శేషారావుకు పరిచయం చేశాడు. వారిలో గూడురు కు చెందిన ఒక డాక్టర్ కు కేంద్ర ప్రభుత్వ పద్మశ్ర అవార్డును ఇప్పిస్తానంటూ అతని వద్ద నుండి భారీ మొత్తంలో డబ్బు గుంజిరనే ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో తనకు మంచి పరచయాలు ఉన్నాయని వారిని నమ్మించిన పోలీసు అధికారి శేషారావు వారి వద్ద నుండి భారీ స్థాయిలో డబ్బులు తీసుకోవడం తో పాటుగా వారిని పల దఫాలుగా ఢిల్లీకి కూడా తీసుకుని పోయినట్టు సమాచారం. పద్మ అవార్డులు వస్తున్నాయంటూ వారిని నమ్మించేందుకు కొన్ని ఫోర్జరీ పత్రాలను సైతం తయారు చేసి ఇచ్చారని బాధితులు ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసు కేసు నమోదు కావడంతో శేషారావు భార్య ప్రసన్నతో పాటుగా అతని కుమారుడు, కోడళ్లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. శేషారావు వ్యవహారలో పోలీసులు ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.
సమాజంలో పలుకుబడి ఉన్న వారు కేంద్ర ప్రభుత్వ అవార్డు కోసం భారీగా డబ్బును సమర్పించుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *