గుడ్డిగా నమ్మి… నగ్న చిత్రాలు తీయించుకుని…

0
128
నగ్న చిత్రాలు

నగ్న చిత్రాలు సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరిస్తున్న మాజీ ప్రియుడు… ప్రియురాలి నగ్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వ్యక్తి… నగ్న చిత్రాల పేరుతో బెదిరింపులు… ఇటువంటి వార్తలు ఈ మధ్య నిత్యం చూస్తూనే ఉన్నాం… యువతులను నమ్మించి వంచించే మోసగాళ్లు చేతులో విలవిలలాడుతున్న అభాగ్యులు ఎంతోమంది అన్నారు. కాలేజీ అమ్మాయిల నుండి సాఫ్ట్ వేర్ ఉద్యోగినుల దాకా… పెళ్లికాని వారితో పాటుగా కొంత మంది గృహిణులు కూడా మోసగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. అందమైన మాటలతో బుట్టలో వేసుకుని ఆ తరువాత వారి అసలు స్వరూపాన్ని బయటపెడుతున్నారు. పరువు పోతుందేమేననే భయంతో ఇటువంటి చాలా వ్యవహారాలు పోలీసుల దాకా చేరడం లేదు.
మితిమీరి వ్యవహరించడం, అతి నమ్మకం, తొందరపాటు, సామాజిక మాధ్యమాల ప్రభావం, సంప్రదాయాలను తుంగలో తొక్కడం లాంటివెన్నో ఆడవారిని సమస్యల సుడిగుండంలోకి నెడుతున్నాయి. కొన్ని కేసుల్లో అమ్మాయిలు వ్యవహరించిన తీరును చూస్తే పోలీసులే ముక్కున వేలేసుకుంటున్నారు. కేవలం ఫేస్ బుక్ లో పరిచయం అయిన వ్యక్తికి, కనీసం ముఖ పరిచయం కూడా లేని వాళ్లకు సైతం తమ నగ్న చిత్రాలు పంపిన ఉదంతాలు కలవరపరుస్తున్నాయి. కేవలం ఆనందం కోసం ఆ విధంగా నగ్నచిత్రాలు పంపానంటూ ఓ యువతి పోలీసులకు చెప్పడంతో వాళ్లు ఖంగుతినాల్సి వచ్చిందట.
మహిళల పేరుతో తప్పుడు ఫేస్ బుక్ ఐడీని రూపొందించుకున్న కేటుగాడు ఒకడు పదుల సంఖ్యలో అమ్మాయిల నగ్న చిత్రాలు సంపాదించాడు. వీరిలో విద్యార్థినులే ఎక్కువ సంఖ్యలో ఉండడం గమనార్హం. చివరికి ఒక యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు వాడిని అదుపులోకి తీసుకుని జైలు పంపారు. అది మొదలు ఇటువంటి ఉదంతాలు అడపాదడపా వెలుగుచూస్తూనే ఉన్నాయి. ప్రేమ పేరుతో దగ్గరయి సన్నిహితంగా ఉన్న సమయంలో ఫొటోలు తీసుకుని వాటిని అడ్డుపెట్టుకుని దెరింపులకు పాల్పడుతున్న ఘటలు షరా మామూలయ్యాయి. వారు అభ్యంతరకర స్థితిలో ఉన్నప్పుడు తీసిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెరిస్తూ డబ్బులు వసూలు చేయడంతో పాటుగా వాళ్లని లైంగికంగా వేధిస్తున్న ఘటనలు ఎన్నో..
ప్రస్తుతం ప్రతీ ఒక్కరి వద్దా ఫోన్లు అందులో ఆధునిక కెమేరాలు సర్వసాధారణంగా మారాయి. సన్నిహతంగా ఉన్నప్పుడు కొంత మంది తీపి గుర్తుల పేరుతో యువతులకు చెప్పిమరీ ఫొటోలు తీసుకుంటున్నారు. మరికొందరు మాత్రం నాలుగుగోడల మధ్య జరిగే వ్యవహారాన్ని రహస్యంగా చిత్రీకరించి రచ్చ చేస్తున్నారు. చాలా మంది యువతులు మాయ గాళ్ల ఉచ్చులో సులభంగా పడుతున్నారు. నమ్మకం ఉన్నప్పుడు ఏకాంత దృశ్యాలు చిత్రీకరించడం ఆపై బెదిరింపులకు దిగడం అలవాటు చేసుకుంటున్నారు.
ఇందులో మోసగాళ్ల కుట్రతో పాటుగా బాధితుల అమాయకత్వం, అలసత్వాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏకాంత దృశ్యాల చిత్రీకరణకు ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం, స్వయంగా నగ్న చిత్రాల సెల్ఫీలను తీసి పంపండం వంటి చర్యలు వాళ్లను ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. పాశ్చత్య సంస్కృతిని గుడ్డిగా అనుసరించడమే ఆధునికతగా చెప్పుుకుంటూ అక్కడి విషపు పోకడలు మనకూ సంక్రమిస్తున్నాయి. మితిమీరిన స్వేచ్చ పక్కదారిపడుతోంది. మాయగాళ్లు వేధిస్తున్నారంటూ నెత్తినేరు బాదుకునే ముందే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
ఎటువంటి వేధింపులు ఎదురైనా నిస్సంకోచంగా పోలీసులను ఆశ్రయించడం ఉత్తమం. షీ టీమ్స్ కు ఫిర్యాదు చేస్తే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వివరాలను బహిర్గత పర్చరు. గోప్యతకు ఢోకా లేకుండా మోసగాళ్ల బారినుండి కాపాడతారు. అయితే పరిస్థితి అంతవరకు రాకుండానే ముందుగానే జాగ్రత్త పడడం మంచింది.
nude pics, nude photo, nude photos of girls.

సమ్మెకు దిగిన బ్యాంకు ఉద్యోగులు


ప్రాణాలు తీస్తున్న అబద్దపు ప్రచారాలు
Crime_in_India

Wanna Share it with loved ones?