నిజాం మ్యూజియం దొంగలు దొరికారు-బంగారు టిఫిన్ బాక్స్ లోనే భోజనం

0
73
nizam tiffin box

nizam tiffin box నిజాం మ్యూజియంలో చోరీకి పాల్పడిన దొంగలు దొరికారు. వారి వద్ద నుండి చోరీకి గురైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాతనగరంలోని పురానీహవేలీలోని నిజాం మ్యూజియం నుండి బంగారు టిఫిన్ బాక్స్ , బంగారపు కప్పు, సాసర్, చెంచాను సినీ ఫక్కీలో దోచుకునిపోయిన సంగతి తెలిసిందే. ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు దొంగలను పట్టుకునేందుకు 20 బృందాలను రంగంలోకి దింపారు. టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటుగా దక్షిణ మండలం పోలీసులు సంయుక్తంగా విచారణ జరిపి ఇద్దరు నిందితులను ముంబాయిలో అరెస్టు చేశారు. దొంగతనానికి పాల్పడిన వారిని పాతబస్తీకి చెందిన మహ్మద్ గౌస్ పాషా అలియాస్ ఖూనీ గౌస్, మహ్మద్ మోబీన్ లుగా పోలీసులు గుర్తించారు. వీరిలో గౌస్ 25 చోరీ కేసుల్లో నిందితుడు కాగా మోబిన్ ఇటీవలే గల్ఫ్ నుండి హైదరాబాద్ కు వచ్చాడని చెప్పారు. మోబిన్ కు కూడా నేరచరిత్ర ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ వివరించారు. బంగారపు టిఫిన్ బాక్సు నాలుగు కిలోల బరువు ఉందని దీనికి విలువైన వజ్రాలు, కెంపులను పొదిగారని వివరించారు. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఈ వస్తువుల ధర అంతర్జాతీయ మార్కెట్ లో సుమారు వంద కోట్ల వరకు ఉంటుందని ఆయన వివరించారు. మ్యూజియం నుండి చోరీకి గురైన అన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన చెప్పారు. చోరీకి పాల్పడిన అనంతరం పోలీసుల కళ్లుగప్పి పారిపోయేందుకు రకరకాల ఎత్తులు వేశారని అయితే అవేవీ ఫలించలేదని కమిషనర్ చెప్పారు. ముంబాయిలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో బసచేసిన వీరిని వలపన్ని అదుపులోకి తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
వెంటిలేటర్ ద్వారా నిజాం మ్యూజియంలోకి ప్రవేశించిన వీరిద్దరూ ఎక్కడా తమ ఆనవాళ్లు సీసీ కెమేరాలకు దొరక్కుండా జాగ్రత్త పడ్డారు. మ్యూజియం లో ఎంత మంది భద్రతా సిబ్బంది ఉన్నారనే దానితో పాటుగా దాని పరిసరాలను క్షుణ్ణంగా తెలుసుకున్న తరువాత చోరీకి పాల్పడ్డారని కమిషనర్ తెలిపారు. వీరిద్దరూ సుమారు 40 రోజుల పాటు రెక్కీనిర్వహించిన తరువాత దోపిడీకి పాల్పడినట్టు ఆయన చెప్పారు. తొలుత బంగారపు పేజీలపై రాసిన పవిత్ర “ఖురాన్” గ్రందాన్ని చోరీ చేద్దామని భావించినప్పటికీ వీరు చోరీకి పాల్పడుతున్న సమయంలో బయటి నుండి నమాజ్ వినిపించడంతో మనసు మార్చుకున్న దొంగలు ఖురాన్ ను వదిలిపెట్టేశారని నగర పోలీసు కమీషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు.
నిజాం టిఫిన్ బాక్స్ లోనే భోజనం
నిజాం కాలంనాటి టిఫిన్ బాక్స్ లో ఆ వంశీయులు ఎంత మంతి ఎన్నిసార్లు భోజనానికి ఉపయోగించారో తెలియదు కానీ దాన్ని చోరీ చేసిన దొంగలు మాత్రం ప్రతీ రోజూ దాంట్లోనే భోజనం చేశారు. అత్యంత విలువైన ఆ పాత్రలో భోజనం చేయడాన్ని గొప్పగా భావించిన ఇద్దరు దొంగలు అందులోనే తిన్నారని పోలీసులు తెలిపారు. అరుదైన ఈ టిఫిన్ బాక్స్ తో పాటుగా కప్పు,సాసర్ లోను అమ్మాలని భావించినప్పటికీ వాటిని కొనుగోలు చేసేవారు దొరక్కపోవడంతో వీరు ముంబాయిలోనే ఉండిపోయారని తమకు ఖచ్చితంగా అందిన సమాచారం మేరకు వారిని పట్టుకున్నామన్నారు.
nizam tiffin box
the Nizam’s Museum, Hyderabad, four-kg gold tiffin box studded with diamonds, rubies and emeralds, gold cup studded with rubies and emeralds, a saucer, a spoon.

Troubling worms in little tummy


Troubling worms in little tummy

Wanna Share it with loved ones?