చైనాకు గట్టి జవాబు చెప్పిన నిర్మలా సీతారామన్

0
90

అరుణాచల్ ప్రదేశ్ విషయంలో రచ్చ చేస్తున్న చైనాకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మాలా సీతారామన్ గట్టి బదులిచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ పూర్తిగా భారత్ అంతర్భాగమని చెప్పిన ఆమె ఈ విషయంలో ఎటువంటి సందేహాలు అవసరం లేదన్నారు. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లో నిర్మాలాసీతారామన్ పర్యటించడాన్ని చైనా తప్పుపట్టింది. అది తమ దేశపు అంతర్భాగమని చెప్పిన చైనా అక్కడ భారత రక్షణ మంత్రి పర్యటించడం సరికాదని పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలను నిర్మలాసీతారామన్ ఖండించారు. అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించడానికి ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంలో చైనా తన వైఖరిని మార్చుకోవాలన్నారు. గతంలోనూ చైనా అరుణాచల్ విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తునే ఉంది. ఈ ప్రాంతంలో దలైలామా ప్రయటన సందర్భంగా కూడా చైనా ఇటువంటి వ్యాఖ్యలే చేసింది.
ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. జమ్ము కాశ్మీర్ లో పరిస్థితులను చక్కదిద్దేందుకు అక్కడి పోలీసులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని అన్నారు. జమ్ములో రాళ్లదాడులు తగ్గాయని వాటిని నిలువరించడంలో భద్రతా బలగాలు సఫలం అయ్యాయని అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ లో తన పర్యటన సందర్భంగా సైనికుల సన్నద్దతను పరిశీలించిన నిర్మల మన సైనికులు అప్రమత్తపై సంతృప్తి వ్యక్తం చేశారు. పాకిస్థాన్ జైల్లో ఉన్న భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ యాదవ్ ను భారత్ కు రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here