తెలంగాణలో కొత్త జోన్లు ఇవే | new zones in telangana

0
65
new zones in telangana

new zones in telangana
తెలంగాణలో కొత్త జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. నూతన జోనల్ విధానానికి సంబంధించిన ఫైలుపై రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం చేయడంతో జోనల్ విధానం అమల్లోకి వచ్చినట్టయింది. ఏడు జోన్లు, రెండు బహుళ జోన్ల విధానం ఇక నుండి ఉద్యోగ నియామకాల్లో అమలు కానుంది. జోన్ల విధానం అమల్లోకి వచ్చిన తరువాత 95శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కుతాయి. ఒకటవ తరగతి నుండి ఏడవతరగతి వరకు నాలుగు సంవత్సరాలు ఓకే ప్రాంతంలో చదివినివారిని స్థానికులుగా గుర్తిస్తారు.
కొత్త జోన్లు
కాళేశ్వరం జోన్‌
జిల్లాలు:భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్‌,పెద్దపల్లి
జనాభా: 28.29 లక్షలు
బాసర జోన్‌
జిల్లాలు: ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల
జనాభా: 39.74 లక్షలు
రాజన్న జోన్‌
జిల్లాలు: కరీంనగర్‌, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్‌,
జనాభా: 43.09 లక్షలు
భద్రాద్రి జోన్‌
జిల్లాలు: వరంగల్‌ గ్రామీణ, వరంగల్‌ అర్బన్‌, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌
జనాభా: 50.44 లక్షలు
యాదాద్రి జోన్‌
జిల్లాలు: సూర్యాపేట, నల్గొండ, యాదాద్రిభువనగిరి, జనగామ
జనాభా: 45.23 లక్షలు
చార్మినార్‌ జోన్‌
జిల్లాలు: హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి
జనాభా: 1.03 కోట్లు
జోగులాంబ జోన్‌
జిల్లాలు: మహబూబ్‌నగర్‌, వనపర్తి, గద్వాల, నాగర్‌కర్నూలు, వికారాబాద్‌
జనాభా: 44.63 లక్షలు
new zones in telangana, zonal system, zones in telangana, telangana zones.
ఎందుకీ ముందస్తు… అసలు కారణాలు ఏంటి?

Wanna Share it with loved ones?