విదేశాలకు చెక్కేసిన నీరవ్ మోడీ?

పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి తప్పుడు పత్రాలను పొందడం ద్వారా 11,400 కోట్ల రూపాయలక కుంభకోణానికి పాల్పడినట్టు అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రపంచ సంపన్నుల్లో ఒకరుగా పేరుగాంచింన నీరవ్ మోడీ ఆచూకీ సీబీఐకి చిక్కడం లేదు. బ్యాంకు అధికారులతో కుమ్మకు కావడం ద్వారా ఇంత పెద్ద మొత్తంలో బ్యాంకును మోసగించిన నట్టు అతనిపై కేసు నమోదయింది. ఈ కేసుకు సంబంధించిన వార్త వెలుగులోకి వచ్చిన వెంటనే నీరవ్ మోడీ ఆచూకీ లభించడం లేదు. ఇప్పటికీ అతను దేశం వదిలిపోయి ఉండాడనే అనుమానాలు వ్యక్త అవుతున్నాయి. ఇయితే అధికారికంగా ఇంతవరకు ఎటువంటి సమాచారం వెల్లడికాలేదు.
బ్యాంకును మోసం చేశారంటూ అభియోగాలు ఎదుర్కొంటున్న మోడీతో పాటుగా ఆయన భార్య, సోదరుడు, మామలతో పాటుగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు చెందిన ఇద్దరు అధికారులపై కూడా కేసులు నమోదయ్యాయి. అత్యంత చాకచక్యంగా పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సదరు వ్యాపారి కుచ్చుటోపీ పెట్టినట్టుగా భావిస్తున్నారు. నీరవ్ కు బ్యాంకు అధికారుల నుండి పూర్తి మద్దతు లభించిందని వారి సహకారంతోనే బ్యాంకును మోసం చేయగలిగాడని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
సీబీఐ తో పాటుగా ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. నీరవ్ నిర్వహించే షోరూంలతో పాటుగా ఆయన కార్యాలయాల్లోనూ సోదాలు జరిగాయి. మొత్తం 12 చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే ఆయన ఆచూకీ మాత్రం తెలియడం లేదు.