లో దుస్తులు విప్పించారు – లైగింకంగా వేధించారు : నీట్ విద్యార్థిని అవేదన

జాతియ స్థాయి మెడికల్ ఎంట్రన్స్ కోసం నిర్వహించే (NATIONAL ELIGIBILITY CUM ENTRANCE TEST) నీట్ లో తనకు జరిగిన అవమానంపై ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పరీక్షలకు హాజరైన తాను పరీక్ష నిర్వాహకుల కారణంగానే లైంగిక వేధింపులకు గురైనట్టు ఆ విద్యార్థిని తన ఫిర్యాదులో పేర్కొంది.ఈ దారుణ ఘటన కేరళలోని పాలక్కాడ్ లో జరిగింది. పరీక్ష హాల్ లో ఇన్విజిలేటర్ గా ఉన్న వ్యక్తి తనను లైంగికంగా వేధింపులకు గురిచేసినట్టు ఆ విద్యార్థిని ఆరోపిస్తోంది. బాధితురాలి కథనం ప్రకారం
బాధితురాలు కేరళలోని పాలక్కాడ్ కొప్పాంలోని లైయన్స్ స్కూల్ లో నీట్ పరీక్షలకు ఆమె హాజరైంది. ఆమె వేసుకున్న లోదుస్తుల్లో మెటల్ ఉండడంతో దాన్ని తొలగించాలి పరీక్షలకు ముందు జరిగిన తనిఖీల్లో అక్కడి సిబ్బింది ఆదేశించారని పేర్కొంది. తప్పని సరి పరిస్థితుల్లో తాను బ్రా ను విప్పేసి పరీక్షకు కావాల్సి వచ్చిందని ఆ సమయంలోనూ చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని వాపోయింది. బట్టలు మార్చుకునేందుకు ఎటువంటి అవకాశం లేదని ఓ మహిళ సహాయంతో పాత గోతాలతో ఏర్పాటు చేసిన చిన్న ప్రదేశంలో తాను బట్టలను మార్చుకోవాల్సి వచ్చిందని ఆ విద్యార్థిని చెప్పింది. అప్పటికే ఈ పరిణామాల వల్ల తాను తీవ్ర మనస్థాపానికి గురైనట్టు ఆమె తన ఫిర్యాదులో తెలిపింది. పరీక్ష రాసేముందు జరిగిన ఈ పరిణామాలతో తాను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయానని అటు తర్వాత పరీక్ష హాల్ ఇంతకు మించిన దారుణం చోటు చేసుకుందని ఆమె వివరించింది.
పరీక్ష హాల్ లో ఉన్న మగ ఇన్విజినేటర్ చర్యలు తనను చాలా బాధించాయని ఆమె పేర్కొంది. పదే పదే తన వైపు అభ్యంతరకరంగా చూడడంతో తాను చాలా ఇబ్బందులు పడాల్సివచ్చిందని అమే వాపోయింది. ” పరీక్ష మొదలు కాగానే నా ఇన్విజిలేటర్ నా దగ్గరగా వచ్చి నిలబడ్డాడు, ముందుగా నేను అతన్ని పెద్దగా గమనించనప్పటికీ అతని చూపులు అభ్యంతరకరంగా ఉన్నాయి. అప్పటికే బయట లో దుస్తులు వదిలేసి వచ్చిన నన్ను అతను అదేపనిగా చూడడం మొదలు పెట్టాడు. నా ఛాతీ భాగం వైపు చూస్తూ ఉండిపోయాడు. పరీక్ష సమయంలో నాలగు సార్లు ఇట్లా జరిగింది. చున్నీ కానీ షాల్ కానీ వేసుకునేందుకు అనుమతి లేకపోవడంతో పరీక్షా పత్రంతో నేను నా శరీరాన్ని కాపాడుకోవాల్సి వచ్చింది” అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
అతని చర్యల కారణంగా పరీక్షా హాల్ నుండి బయటికి పరుగెత్తాలనిపించిందని అయితే తన కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పనిచేయకపోయినట్టు ఆమె చెప్పింది. ఇన్విజినేటర్ కారణంగా తాను సరీగా పరీక్ష రాలేకపోయానని ఇది తనను తీవ్రంగా బాధిస్తోందని ఆ విద్యార్థిని వాపోయింది.
నీట్ పరీక్షల్లో సీబీఎస్సీ పెడుతున్న నిబంధనల పట్ల పలువురు ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దుస్తుల చేతులు (స్లీవ్స్) పొడవుగా ఉండడం నిబంధనలకు విరద్దమంటూ బలవంతంగా వాటిని కత్తిరించారని ఫిర్యాదులు అందాయి. గత సంవత్సరం కూడా బలవంతంగా తన లోదుస్తులు విచ్చించారంటూ ఓ విద్యార్థిని చేసిన ఫిర్యాదు తీవ్ర దుమారం రేపింది.
harassed by an examination invigilator during the exam,Central Board of Secondary Education,NEET exam, CBSE-NEET guidelines,Palakkad,undress.

అమిత్ షా కాన్వాయ్ పై దాడి


ప్రగతీ రీసార్ట్స్ హత్య కేసులో స్నేహితుడే నిందితుడు