నిరాహర దీక్షకు దిగనున్న ప్రధాని మోడీ | Modi day long fast

0
131
ప్రధాని మోడీ
ఒక రోజు దీక్షకు దిగనున్న ప్రధాని మోడీ.

ప్రధాని నరేంద్ర మోడీ ఒకరోజు నిరాహార దీక్షకు దిగనున్నారు. గతంలో ఏ భారత ప్రధాని కూడా నిరాహార దీక్షకు దిగిన దాఖలాలు లేవు. పార్లమెంటు సమావేశాలను విపక్షాలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టిన నిరాహాద దీక్ష కార్యక్రమంలో ప్రధాని మోడీ కూడా పాల్గొననున్నారు. పార్లమెంటు సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకునిపోవడం పై మోడీ మనస్థాపం చెందినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ప్రతిపక్షల చర్యలకు నిరసనగా బీజేపీ నిర్వహించనున్న నిరాహార దీక్ష కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడితో పాటుగా మంత్రులు, ఎంపీలు కూడా పాల్గొంటారని బీజేపీ అధికార ప్రతినిధి జీ.వీ.ఎల్.నరసింహా రావు తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటకలోని హుబ్లీలో నిరాహార దీక్ష చేస్తారని ఎంపీలు ఎవరి నియోజకవర్గాల్లో వారు నిరాహార దీక్షకు పూనుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ప్రధాని నరేంద్ర మోడీ నిరాహార దీక్ష చేపడుతున్నప్పటికీ అధికారిక కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం లేకుండా ఆయన తన కార్యకలాపాలను నిర్వహిస్తారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. మోడీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే నిరహార దీక్ష చేస్తారని వారు వెల్లడించారు.
ప్రధాని మోడీ తో సహా బీజేపీ శ్రేణులు ఎప్రిల్ 12 నిరహారదీక్ష కార్యక్రమాల్లో పాల్గొంటారు. పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుని పోయిన సంగతి తెలిసిందే. పార్లమెంటులో ఎటువంటి చర్చజరక్కుండానే ప్రతీరోజు వాయిదా పడతూరావడం 2000 సంవత్సరం తరువాత ఇప్పుడే జరిగింది. పార్లమెంటు సమావేశాలను వివిధ రాజకీయ అంశాలతో విపక్షాలు అడ్డుకున్నాయి.
వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీతో పాటుగా విపక్షాలు ఇచ్చిన అవిశ్వాసతీర్మానం కూడా చర్చకు రాకుండానే పార్లమెంటు సమావేశాలు ముగిసిపోయాయి. దీనిపై విపక్షాలు పెద్ద ఎత్తున అధికర పక్షంపై విమర్శలు గుప్పించడంతో బీజేపీ ఇప్పుడు ఎదురుదాడికి దిగింది. విపక్షాల వల్లే పార్లమెంటులో ఎటువంటి చర్యలు జరగడంలేదని బీజేపీ ఆరోపిస్తోంది.
బీజేపీ ఒకరోజు నిరాహర దీక్షను కాంగ్రెస్ తో పాటుగా విపక్షాలు ఎద్దేవా చేశాయి. పార్లమెంటు ముగిసిన వారంరోజులకు దీక్షకు పూనుకోవడం ఏమిటని అవి ప్రశ్నిస్తున్నాయి. అన్నాడీఎంకే తో చేసుకున్న మ్యాచ్ ఫిక్సింగ్ వల్లే కీలకమైన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా బీజేపీ సభను వాయిదా వేస్తూ పోయిందని, సభను నిర్వహించడం బీజేపీకి చేతకాలేదని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది.
సభనిర్వహించలేక చతికిలపడిన బీజేపీ ఇప్పుడు విపక్షాలపై నెపంరుద్దే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు. సభను నిర్వహిస్తే అధికార పక్షం చేతకాని తనాన్ని ఎత్తిచూపుతారనే భయంతోనే సభను నిర్వహించకుండా ఇప్పుడు విపక్షాల కారణంగా సభ జరగలేదనడం హాస్యస్పదమని అన్నారు.
Prime Minister Narendra Modi day-long fast,Budget Session of Parliament,BJP spokesperson G.V.L. Narsimha Rao,Bharatiya Janata Party, BJP President Amit Shah, hunger strike,Hubli in Karnataka,the Congress,Parliament stalemate,Budget Session 2018,Parliament disrupted.
నరేంద్ర మోడీ
narendra modi
Prime_Minister_of_India

Constitution_of_India

Wanna Share it with loved ones?