నారాయణ కాలేజీ విద్యార్థుల మధ్య ఘర్షణ

స్వల్ప విషయంపై విద్యార్థుల తలెత్తిన ఘర్షణ తీవ్ర రూపం దాల్చింది. ఒక విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడిచేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డారు. వీరంతా ఇంటర్ చదువుతున్న వారే కావడం గమనార్హం. వనస్థలిపురంలోని నారాయణ కాలేజీలో విద్యార్థుల మధ్య జరిగిన వివాదం ఒకరి పై దాడికి దారితీసింది. సుమారు 20 మంది విద్యార్థులు కలిసి ఒకరిని చితకబాదడంతో అతనికి గాయాలయ్యాయి. రక్తపు గాయాలతో సదరు విద్యార్థి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఇంటర్ చదువుతున్న మల్లికార్జున్ అనే యువకుడు తన సోటి విద్యార్థులను ముద్దుపేర్లతో పిలుస్తూ వారిని ఆటపట్టిస్తుండడం ఈ గొడవకు కారణంగా తెలుస్తోంది. ముద్దు పేర్లతో పిలవవద్దంటూ చెప్పినా మల్లికార్జున్ వినిపించుకోకపోవడంతో అతనిపై క్లాస్ లోని ఇతర విద్యార్థులు దాడిచేసి కొట్టారు. తనపై దాడిచేసిన వారిలో ఐదుగురిపై మల్లికార్జున్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అయితే ఈ గొడవకు ఇతర కారణాలు కూడా ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *