నంద్యాలలో సం'కుల' సమరం

0
47

నంద్యాల ఉప ఎన్నికల్లో సం”కుల” సమరం నడుస్తోంది. నంద్యాలలో బలంగా ఉన్న సామాజిక వర్గాల మద్దతు కూడగట్టుకునేందుకు అధికార తెలుగుదేశం పార్టీతో పాటుగా విపక్ష వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బలమైన సామాజిక వర్గాలకు చెందిన నేతలను తమ వైపుకు తిప్పుకునేందుకు ఇరు వర్గాలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. సమాజిక వర్గాల వారీగా కుల సభలను నిర్వహిస్తున్నాయి. నంద్యాల నియోజక వర్గంలో ముస్లీంలు, ఆర్యవైశ్య, బలిజ వర్గాలకు గట్టి పట్టుంది. దీనితో వారి మద్దతు కోసం ఇరు పార్టీలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆయా వర్గాల ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాలు ప్రకటించడంతో పాటుగా ప్రత్యర్థి వర్గం ఆయా సామాజిక వర్గాలకు న్యాయం చేయలేదని తామే ఆ పని చేయగలమంటూ ప్రచారం చేస్తున్నాయి.
గతంలో ఎన్నడూ లేనంతగా నంద్యాలలో కుల సమీకరణాలు ఎక్కువయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎన్నికల్లో కుల ప్రభావం సాధారణంగా ఉండేదే అయినా నేరుగా కుల సభలు పెట్టి మరీ ఆయా కులాలకు సంబంధించిన ఓట్లను తమకు వేయాలంటూ కోరడం మాత్రం ఈ ఎన్నికల్లోనే ఎక్కువగా కనిపిస్తోందని వారు చెప్తున్నారు. నియోజక వర్గంలో గట్టి పట్టున్న ముస్లీం ఓటర్లను ఆకట్టుకునేందుకు తెలుగుదేశం, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలు గట్టిగా ప్రయత్నాలు చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ ముస్లీం అభ్యర్థిని ప్రకటించడం ద్వారా వారి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అయితే వారు ఎవరి వైపు మొగ్గుతారనేదే ఇప్పుడు ప్రధానంగా మారింది. ఎవరికి వారు ముస్లీం ఓట్లన్ని తమకే పడతాయని పైకి చెప్తున్నా లోపల మాత్రం వారి ఓట్లు ఎటు పడతాయనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here