నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా 7వ వార్డులో ఉధ్రిక్తలు చోటు చేసుకున్నాయి. ఇక్కడ దొంగ ఓట్లు పోలవుతున్నాయంటూ టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు పరస్పరం ఆరోపణలకు దిగడంతో పరిస్థితి ఉధ్రిక్తంగా మారింది. దీనితో వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి మరింత విషమించకుండా అడ్డుకున్నారు. ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేశారు. పోలింగ్ ఆఖర దశకు చేరుకోవడంతో ఇరు వర్గాలు పోటాపోటీగా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఘర్షణ మొదలైనట్టు తెలుస్తోంది. నంద్యాలలో ఇప్పటి వరకు దాదాపు 76 శాతం పోలింగ్ నమోదయినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గ్రామీఅ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఓటర్ల తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.