నంద్యాలలో ప్రశాంతంగా పోలింగ్

0
44

నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గంలో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఉదయం నుంచే ఓటర్ల పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి కనిపించారు. వైఎస్ఎర్ కాంగ్రెస్ పార్టీ తరపున గెల్చి తెలుగుదేశం పార్టీలో చేరిన భూమా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గం నుండి టీడీపీ నుండి భూమా నాగిరెడ్డి అన్న కుమారుడు భూమా బ్రహ్మనంద రెడ్డి పోటీ చేస్తుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఎన్నికల ముందు దాకా శిల్పా మోహన్ రెడ్డి టీడీపీలో ఉండగా ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో శిల్పా మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయగా భూమా నాగిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెల్చారు.
నంద్యాల ఉప ఎన్నికను అటు అధికారు టీడీపీ, ఇటు విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోటా పోటీగా ప్రచారం జరిపాయి. నంద్యాల ఉప ఎన్నికల్ల ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. స్థానిక పోలీసులతో పాటుగా కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాను మోహరించారు. పోటీ తీవ్రంగా ఉండడంతో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకుని వచ్చేందుకు ఇరు పార్టీలు కసరత్తులు చేస్తున్నాయి. తమకు అనుకూలంగా ఉన్న వారిని పోలింగ్ కేంద్రాలకు తీసుకుని వచ్చే ఏర్పాట్లను కూడా పార్టీలు చేస్తున్నాయి. ఒక్క ఓటును కూడా వదులుకునేందుకు పార్టీలు సిద్ధంగా లేకపోవడంతో ఈ దఫా పోలింగ్ శాతం పెరుగుతుందని భావిస్తున్నారు. పోలింగ్ సరళిని ఎన్నికల సంఘం వేబ్ క్యాస్టింగ్ ద్వారా పరిశీలిస్తోంది.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here