కుడికాల్వకు నీరు బంద్-నాగర్జున సాగర్ వద్ద ఉధ్రిక్తత

నాగార్జున సాగర్ డ్యాం వల్ల తెలంగాణ-అంధ్రప్రదేశ్ అధికారుల మధ్య నీటి విడుదల విషయంలో జరిగిన వాగ్వాదం తీవ్రం కావడంతో అక్కడ ఉధ్రిక్తత వాతావరణం నెలకొంది. డ్యాంకు ఇరు వైపులు తెలంగాణ, ఆంధ్రా పోలీసులు బారీ సంఖ్యలో మోహరించారు. అంధ్రప్రదేశ్ నిర్ణయించిన నీటికంటే ఎక్కువ మొత్తంలో వాడుకుందని. నీటి విడుదలను నిలిపివేయాలని కృష్ణ యాజమాన్య బోర్డు ఇటీవల చెప్పిన తరువాత ఇరు రాష్ట్రాల నీటి వాడకం విషయంలో గొడవలకు దిగుతున్నాయి.
సాగర్ కుడికాల్వ ద్వారా ఇప్పటివరకు 10.2 టీఎంసీలను విడుదల చేశారు. అంధ్రాకు మొత్తం 10.5 టీఎంసీల నీటిని కేటాయించారని ఇంకా తమకు 0.3 టీఎంసీల నీటిని వాడుకునే హక్కుఉందని ఆంధ్రప్రదేశ్ అధికారులు వాదిస్తుండగా వారి వాదనను తెలంగాణ అధికారులు కొట్టేస్తున్నారు. సాగర్ కుడి కాలువ గుండా అంధ్రప్రదేశ్ కు నీటి విడుదలను తెలంగాణ నిలిపివేయడంతో ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారుల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు కురిపించుకోవడంతో పరిస్థితి ఉధ్రిక్తంగా మారడంతో పెద్ద మొత్తంలో ఇరు రాష్ట్రాలకు చెందిన పోలీసులు చెరోవైపు మోహరించారు.
పరిస్థితిని చక్కదిద్దడం కోసం ఇరురాష్ట్రాలకు చెందిన అధికారుల మధ్య చర్చలు జరుగుతున్నాయి.