వరద నీటిలోనే ముంబాయి నగరం

0
62

దేశ ఆర్థిక రాజధాని ముంబాయిలో పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకోలేదు. ఇంకా ముంబాయి మహా నగరాన్ని నీళ్లలో తేలుతూనే ఉంది. మంగళవారం కురిసిన భారీ వర్షానికి అతలాకుతలం అయిన ముంబాయి నగరం ఇంకా తేరుకోలేదు. నగరంలోని అనేక ప్రాంతాలు ఇంకా వరద నీటిలోనే మునిగి ఉన్నాయి. స్కూళ్లు, కాలీజీలు, ఆఫీసులు మూత పడ్డాయి. వ్యాపారాలు జరగడం లేదు. మంగళవారం ఆఫీసులకు వెళ్లి అక్కడ చిక్కుకుని పోయిన వారు బుధవారం ఆఫీసుల నుండి బయటకు వచ్చే ప్రయత్నాలు చేసినా సాధ్యం కాకపోవడం తో ఇంకా వేలాది మంది కార్యాలయాల్లోనే మగ్గుతున్నారు. వేలాది మంది బిక్కు బిక్కు మంటూ కాలం గడుపుతున్నారు. నగరంలో పాలు, కూరగాయలు లాంటి నిత్యావసర వస్తువులకు కొరత ఏర్పడింది.
ముంబాయిలో సహాయక చర్యల కోసం విపత్తు నివారణ సంస్థతో పాటుగా సైనిక దళాలు కూడా రంగంలోకి దిగాయి. నేవి దళాలు వరదలో చిక్కుకుని పోయిన వారికి సహాయం అందిస్తున్నారు. ప్రజలను రక్షించడంతో పాటుగా నిత్యావసర వస్తువులను సరఫరా చేస్తున్నారు. యుంబాయిలో యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ముంబాయిలోని కొన్ని ప్రాంతాల్లో కమ్యునికేషన్ వ్యవస్థకు ఆటంకం కలిగింది. దీనితో క్షేమ సమాచారాలను ఇచ్చే అవకాశం లేక స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here