ముంబాయిలో భవనం కూలి 19 మంది మృతి

0
32

ముంబాయి మహానగరంలో భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 19కి పెరిగింది. ఈ ప్రమాదంలో అనేక మందికి గాయాలయ్యాయి. వీరిలో అగ్ని మాపక సిబ్బంది కూడా ఉన్నారు. శిధిలాల కింద మరింత మంది ఉండవచ్చని భయపడుతున్నారు. బెండీ బజార్ లోని ఈ ఐదంస్తుల భవనంలో మొత్తం ఐదు కుటుంబాలు నివాసం ఉంటున్నట్టు సమాచారం. 50 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవనం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నాని కుప్పకూలినట్టు భావిస్తున్నారు. ఇదే భవనంలో ఒక ప్లే స్కూల్ కూడా నడుస్తున్నట్టు తెలుస్తోంది. ఉపయమే ప్రమాదం జరగడంతో అప్పటికీ స్కూల్ విద్యార్థులు ఎవరూ పాఠశాలకు రాలేదు. దీనితో భారీ ప్రమాదం తప్పినట్లయింది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఘటనా స్థలికి చేరుకుని సహాయక కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుుటంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను ఇస్తున్నట్టు ప్రకటించారు. భవనం కుప్పకూలిన ఘటనపై విచారణ జరుపుతున్నట్టు ప్రకటించిన ఆయన బాధ్యలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో శిధిలావస్థకు చేరుకున్న భవనాలపై దృష్టి సారిస్తున్నట్టు ఆయన తెలిపారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here