డబ్బే ప్రధానం కాదంటున్న ముఖేష్ అంబానీ

దేశంలోనే అత్యంత సంపన్నడు ముకేష్ అంబానీకి క్రెడిట్ కార్డు కూడా లేదట. ఆయన ఎప్పుడు బయటకి వెళ్లిన డబ్బులు వెంట తీసుకుని రాడట. తనకు డబ్బులు అవసరం లేదని దాని గురించి తాను ఆలోచించనని అంటున్నాడు ఈ శ్రీమంతుడు. ఢిల్లీలో జరుగుతున్న హింధుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సదస్సులో పాల్గొన్న ముకేష్ అంబానీ ఈ విషయాలను చెప్పాడు. తనకు డబ్బు ముఖ్యం కాదని వనరులు ముఖ్యమని చెప్తున్నాడు. రానున్న 10-12 సంవత్సరాల్లో భారత ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పెరుగుదలను తాను ముందుగానే అంచానా వేసినట్టు ముకేష్ అంబానీ చెప్పారు.
భారత ఆధార్ వ్యవస్థ చాలా బాగుందని దీని గురించి ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని ముకేష్ అంబానీ అన్నారు. వ్యక్తిగత గోప్యతకు సంబంధించి మన ఆధార్ వ్యవస్థ ప్రపంచంలోనే మేటి అని కొనియాడారు. ప్రస్తుత జెనరేషన్ చాలా వినూత్మంగా ఆలోచిస్తోందని ముకేష్ పేర్కొన్నారు. తాను కూడా తన పిల్లల నుండి అనేక విషయాలను నేర్చుకుంటున్నట్టు చెప్పారు.