రాష్ట్ర మంత్రి పదవిపై ఎంపీ మల్లారెడ్డి కన్ను…?

0
71
ఏపీ మల్లారెడ్డి
malkajgiri mp malla reddy

మల్కాజ్ గిరీ లోక్ సభ నియోజవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్లారెడ్డి ఈ దఫా పార్లమెంటుకు కాకుండా అసెంబ్లీకి పోటీచేస్తారనే వార్తలు జోరుగా సాగుతున్నాయి. అసెంబ్లీకి ఎంపికయి మంత్రి పదవిని చేపట్టాలనేది ఆయన కోరిక అని ఆ ప్రకారం ఆయన పావులు కదుపుతున్నారనేది ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం మల్కాజ్ గిరీ నియోజవర్గం పరిధిలోని ఓ శాసనసభ స్థానం పోటీచేసేందుకు మల్లారెడ్డి ఆశక్తి చూపుతున్నారని తెలుస్తోంది.
విద్యా వ్యాపారాల్లో ఆరితేరిన మల్లారెడ్డి చిన్న స్థాయి నుండి పైకి వచ్చారు. అంచలంచలుగా ఎదిగిన ఆయన పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్నారు. రానున్న ఎన్నికల్లో లోక్ సభ కన్నా అసెంబ్లీ కి ఎంపిక కావడానికే ఆయన కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ఒక నియోజకవర్గానికి సంబంధించి అన్ని సమాచారాలాను సేకరించి పెట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. నియోజకవర్గానికి చెందిన కొంతమంది ముఖ్యనేతలతో ఎంపీ టచ్ లో ఉన్నట్టు సమాచారం. రాజకీయాల్లో చురుకైన పాత్రను సోషిస్తున్న మల్లారెడ్డి రానున్న రోజుల్లో పార్టీలో మరింత పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే లోక్ సభ సభ్యుడిగా కాకుండా శాసనసభ సభ్యుడిగా ఉండడం వల్ల మంత్రి పదవితో పాటుగా పార్టీలో మరింత చురుకైనా పాత్రను పోషించే అవకాశం వస్తుందని భావిస్తున్న ఆయన ఈ దిశగా పావులు కదుపుతున్నట్టు సమాచారం.
అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీ నుండి పార్లమెంటుకు ఎన్నికైన ఆయన అటు తర్వాత టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన నాటినుండి పార్టీకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ అధిష్టానం దృష్టిని ఆకర్షించారు.ఎంపీ మల్లారెడ్డి మంత్రిపదవిపై ఆశలు పెట్టుకున్న విషయాన్ని ఆయనకు సన్నిహిత వర్గాలు కూడా ప్రైవేటు సంభాషణల్లో ఒప్పుకుంటున్నాయి. అంగ బలం, ఆర్థిక బలం పుష్కలంగా ఉన్న ఆయన మల్కాజ్ గిరీ లోక్ సభ నియోజక వర్గం నుండి పోటీ చేసే అవకాశం లేదని అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తారనే ప్రచారం బలంగా వినిపిస్తోంది. ఆయన ఆశించిన సీటు వస్తే మాత్రం ఖచ్చితంగా అసెంబ్లీ బరిలోనే దిగుతారని అంటున్నారు. పార్టీ పెద్దలకు ఇప్పటికే తన మనసులోని మాటను ఆయన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఆయనకు పార్టీ అధిష్టానం నుండి ఇంకా పూర్తిగా భరోసా లభించలేదని అది వచ్చిన వెంటనే నియోజక వర్గంపై మరింత ఎక్కువ దృష్టిపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాలపై ఎక్కువగా దృష్టిపెట్టడంతో మల్లారెడ్డి లాంటి నేతలు లోక్ సభలోనే ఉండాలని ఆయన భావిస్తే మాత్రం మాల్కాజ్ గిరి ఎంపీ ఆశలు వమ్ముకావడం ఖాయం. ప్రస్తుతానికి ఈ విషయాన్ని పక్కనపెట్టిన ముఖ్యమంత్రి ఆయన సేవలను పార్టీ మరింత ఎక్కువ ఉపయోగించుకోనుందనే సంకేతాలను ఇచ్చారు. టీఆర్ఎస్ ప్లీనరీతో పాటుగా ఇతరత్రా పార్టీ కార్యక్రమాల్లో మల్లారెడ్డి చురుగ్గా పాల్గొంటున్న సంగతి తెలిసిందే.
దేశంలోనే విభిన్న లోక్ సభ నియోజక వర్గాల్లో ఒకటిగా పేరుపొందిన మల్కాజ్ గిరీ నియోజకవర్తం నుండి మల్లారెడ్డి గత ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించారు. సిట్టింగ్ ఎంపీ మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ, మైనంపల్లి హన్మంతరావు, లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ, మాజీ డీజీపీ దినేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ లాంటి మేధావులను, హేమాహేమీలను మట్టికరిపించిన మల్లారెడ్డి చరిత్ర సృష్టించారు.
malla reddy, mp malla reddy, malkajgiri, malkajgiri lok sabha seat, mp malla reddy trs, trs mp malla reddy, trs mp malla reddy , mall reddy engineering college, trs mp, trs mp malla reddy in lok sabha.

రాహుల్ తో పెళ్లి వార్తలపై స్పందిచిన అధితీ సింగ్


/encounter
Malkajgiri_(Lok_Sabha_constituency)

Wanna Share it with loved ones?