అత్యంత కాలుష్య నగరం గా ఢిల్లీ | most polluted cities

భారత రాజధాని ఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్యనగరం గా అపఖ్యాతిని మూటకట్టుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరం గా ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉంది. ప్రపంచంలోనే అత్యంత కలుషిత 20 నగరాల జాబితాను ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేయగా అందులో 14 నగరాలు భారత్ లోనే ఉన్నాయి.
ఢిల్లీతో పాటుగా ఆర్థిక రాజధాని ముంబాయి, ఆధ్యాత్మిక రాజధాని వారణాసితో పాటుగా గ్వాలియర్, కన్పూర్, ఫరీదాబాద్, గయా, పాట్నా, ఆగ్ర, ముఫరాబాద్, శ్రీనగర్, గుడ్ గావ్, జైపూర్, పటియాలా, జోధ్ పూర్ లు ఈ జాబితాలో ఉన్నాయి. భారత్ తో పాటుగా ఈజిప్టు రాజధాని కైరో, చైనా రాజధాని బీజింగ్, బాంగ్లాదేశ్ రాజధాని ఢాకా లు ఈ జాబితాలో చోటు సంపాదించుకున్నాయి.
చైనా రాజధాని బీజింగ్ లో కాలుష్యం కాస్త తగ్గగా మన దేశరాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబాయిలలో కాలుష్యం గణనీయంగా పెరిగినట్టు ఆ నివేదికలో పేర్కొంది. అత్యంత కాలుష్య నగరం గా మాత్రం ఢిల్లీ నిల్చిపోయింది.
గాలిలోని పర్టిక్యులేట్‌ మాటర్‌(పీఎం) ఆధారంగా కాలుష్య తీవ్రతను అంచానా వేస్తారు. ప్రపంచంలోని ప్రతీ 10 మందిలో 9 మంది కాలుష్యపూరిత గాలినే పీలుస్తున్నారని ప్రపంచ ఆరోగ్యసంస్థ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్యం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 70 లక్షల ఒక్కో 2016 లోనే మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది.
గాలిలో కాలుష్యం ఆందోళన స్థాయిలో పెరిగిపోయిందని ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రజల ఏమరపాటు కారణంగా ఏటా లక్షలాది మంది ప్రాణాలు గాలిలో కస్తున్నట్టు, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. పరిశ్రమలతో పాటుగా పెద్ద ఎత్తున తిరగుతున్న మోటారు వాహనాల వల్ల కూడా వాయికాలుష్యం విపరీతంగా పెరిగిపోయిందని ఆ సంస్థ తన నివేదికలో స్పష్టం చేసింది.
వాయుకాలష్యం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ తో పాటుగా గుండెపోటు, గుండె జబ్బులు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్యసంస్థ పేర్కొంది. ఢిల్లీలో పరిమితి కంటే దాదాపు పదిరెట్లు కాలుష్యం ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్యసంస్థ వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా 108 దేశాల్లోని 4300 దేశాల్లో వాయికాలుష్యం ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు. మరో 1000 నగరాలను ప్రమాదకర జాబితాలో చేర్చారు. వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు కొన్ని నగరాలు ప్రశంసనీయమైన చర్యలు చేపట్టినప్పటికీ కొన్ని నగరాలు ప్రమాదం ముంచుకుని వస్తున్నా పట్టించుకోవడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.
అత్యంత కాలుష్య నగరం గా అపఖ్యాతిని మూటకట్టుకున్న ఢిల్లీలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలిసిందే. చలికాలంలో అయితే పొమంచుతో కూరుకుని పోయిన ఢిల్లీలో చాలా రోజుల పాటు ప్రజలు ఇండ్ల నుండి బయటకు రాలేని పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే.
most polluted cities, Delhi and Varanasi are among the 14 Indian cities that figured in a list. The World Health Organisation. air pollution,pollution. air pollution database.

medical-seats
ata
concentration
Particulates
Microscopic_scale