తెలంగాణ ప్రజల చేతికి చిప్పే : షబ్బీర్ అలీ

0
86
తెలంగాణ-కాంగ్రెస్-నేత -షబ్బీర్ ఆలీ
telangana-congress-leader-shabbir ali.

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు. టీఆర్ఎస్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని ఆయన దుయ్యబట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముస్లీంలను పూర్తిగా మోసం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ముస్లీంలకు అరచేతిలో స్వర్గం చూపిస్తున్న కేసీఆర్ వారిని అన్ని విధానాలుగా మోసం చేస్తున్నారని షబ్బీర్ అలీ మండిప్డడారు. ముస్లీంలకు 12 శాతం రిజర్వేషన్ల విషయం ఏమయిందని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చలేదని ఆయన చెప్పేవన్నీ మోసపూరిత మాటలేనని అన్నారు.
తెలంగాణలో ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుని పోయిందని షబ్బీర్ ఆలీ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబంతో పాటుగా టీఆర్ఎస్ నాయకులు దోచుకుని తింటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తామని చెప్పారు. అవినీతికి పాల్పడుతున్న కేసీఆర్ తో పాటుగా టీఆర్ఎస్ నాయకులు ఊచలు లెక్కబెట్టడం ఖాయమని షబ్బీర్ ఆలీ జోస్యం చెప్పారు.ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఒక్కో వ్యక్తిపై రూ.53 వేల భారం పడుతుందని తెలిపారు. మజ్లిస్‌ నాయకుడు అసదుద్దీన్‌ ఓవైసీ అక్రమంగా వేలాది కోట్లు సంపాదించుకున్నాడని, అటువంటి ఓవైసీకి కేసీఆర్ మద్దతు ఇస్తున్నాడని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఇప్పుడు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుని పోయిందని షబ్బీర్ ఆలీ పేర్కొన్నారు. మిగులు బడ్జెట్‌ ఉన్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆరోపించారు. ధనిక రాష్ట్రం అంటూ చెప్పుకుంటున్న కేసీఆర్ మరి ఎందుకు అప్పులు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వంలో కోట్లాది రూపాయల అవినీతి జరుగుతోందన్నారు. ప్రాజెక్టుల పేరుతో కాంట్రాక్టర్లకు లాభం చేకూరే విధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ పాలన కొనసాగితే తెలంగాణ ప్రజల చేతికి చిప్ప రావడం ఖాయమన్నారు.
Mohammed Ali Shabbir, shabir ali, kamareddy, kama reddy, shabir ali kama reddy, congress party, telangana congress, telangana congress party,

ప్రణబ్ ముఖర్జి పై ఊహాగానాలకు తెర


ఉత్తర్ ప్రదేశ్ లో ఏంజరుగుతోంది-బీజేపీ కలవరం
Telangana

Wanna Share it with loved ones?