మోడీ-షాల తరువాతి లక్ష్యం హైదరాబాదేనా…?

modi next target జమ్ముకాశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తికి సంబంధించిన ఆర్టికల్ 370 ను రద్దు చేయడం ద్వారా సంచలనం సృష్టించిన మోడీ-షా ద్వయం తరువాతి లక్ష్యం ఏమటి… ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. జమ్ము-కాశ్మీర్ తో పాటుగా ప్రస్తుతం పాక్ ఆక్రమణలో కాశ్మీర్ కూడా భారతదేశంలో అంతర్భామని లోక్ సభలో తేల్చిచెప్పిన అమిత్ షా దీనికోసం అవసరం అయితే ప్రాణత్యాగానికి సైతం సిద్ధమని ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి స్వాధీనం చేసుకునే దిశగా బీజేపీ ప్రభుత్వం పావులు కదుపుతోందనే వార్తలు వస్తున్నప్పటికీ ఈ విషయంలో ఆచీ తూచీ వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ లోపుగా చాలా కాలంగా పీడిపిస్తున్న మరికొన్ని సమస్యలను చక్కదిద్దే పనిలో మోడీ ప్రభుత్వం పడిందనే వార్తలు వస్తున్నాయి.
మోడీ తరువాతి లక్ష్యం హైదరాబాద్ అనే వార్తలు కూడా వస్తున్నాయి. హైదరాబాద్ ను దేశానికి రెండవ రాజధానిగా ప్రకటించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా హైదరాబాద్ ను దేశానికి రెండవ రాజధానికి ప్రకటించాలని దానికి అనుగుణంగా కేంద్రప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని వార్తలు వస్తున్నాయి. దీని ద్వారా అంబేద్కేర్ వారసులుగా చెప్పుకుంటున్న వారి కన్నా తామే అంబేద్కర్ కు నిజమైన వారసులమని చెప్పుకునే క్రమంలోనే బీజేపీ ఈ అడుగులు వేస్తున్నట్టు సమాచారం.
ఆర్టికల్ 370ను రద్దు చేయడంతో పాటుగా జమ్ము కాశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం ద్వారా అక్కడి శాంతి భద్రతల అంశం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో వచ్చేశాయి. దీనితో ఉగ్రవాదం పై ఉక్కుపాదం మోపేందుకు కేంద్రానికి ఎటువంటి అడ్డంకులు ఉండవు. ఇన్నాళ్లు కాశ్మీర్ ను ఏలుతున్న అబ్దుల్లా, ముఫ్తీ కుటుంబాల పాలనకు కూడా చరమగీతం పాడేందుకు ఈ చర్య దోహదపడుతోంది. అదే విధంగా హైదరాబాద్ పాత బస్తీని కేంద్రంగా చేసుకుని చక్రం తిప్పుతున్న ఓవైసీ కుటుంబ పాలనకు కూడా అడ్డుకట్ట వేయాలనే సంకల్పంతో మోడీ ముందుకు సాగుతున్నట్టు అనధికార వర్గాలు చెప్తున్నాయి.
దీనికోసమే హైదరాబాద్ ను దేశానికి రెండవ రాజధానికి ప్రకటించడంతో పాటుగా ఈ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీని వల్ల ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న శాంతి భద్రతల నిర్వహణ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వస్తుంది. పాతనగరంలో ఎంఐఎం పార్టీ ఆగడాలను రాష్ట్ర పోలీసులు కాస్త చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితులు ప్రస్తుతం అనిపిస్తున్నాయి. అయితే హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారితే ఆ పరిస్థితులు ఉండవు. శాంతి భద్రతలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లిపోతాయి. దీని ద్వారా హైదరాబాద్ పాతబస్తీలోని అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని మోడీ సర్కారు భావిస్తున్నట్టు సమాచారం.
హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తే తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు ఎగిసిపడే అవకాశాలు ఉన్నాయి. దీన్ని దృష్టిలోపెట్టుకునే దేశానికి రెండ రాజధాని అనే అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకుని వస్తున్నట్టు కనిపిస్తోంది. హైదరాబాద్ ను దేశానికి రెండవ రాజధానిగా ప్రకటిస్తే నగరం మరింత అభివృద్ధి చెందుతుందనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుని వెళ్లి తద్వారా ప్రజల్లోని అశాంతిని తగ్గించాలనేది బీజేపీ వ్యూహంగా కనిప్తోంది. తెలంగాణలో పాగా వేసేందుకు అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తున్న బీజేపీ హైదరాబాద్ అంశాన్ని సీరియస్ గా పరిశీస్తున్నట్టు సమాచారం.
ఆర్టికల్ 370రద్దుతో కాశ్మీర్ కు పూర్వ వైభవం వస్తుందా…?