ప్రధాని మోడీకి నిస్సాన్ కంపెనీ లీగల్ నోటీసులు

భారత ప్రధాని నరేంద్ర మోడీకి నీగల్ నోటీసులు జారీ అయ్యాయి. జపాన్ కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ నిస్సాన్ మోటర్స్ ఈ నోటీసులు జారీచేసినట్టు సమాచారం. తమ సంస్థకు ఇవ్వాల్సిన ప్రోత్సహాల బకాయిలను చెల్లించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ సంస్థ ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీకి లీగల్ నోటీసులు పంపడంతో పాటుగా భారత్ పై 5వేల కోట్ల రూపాయల దావా వేసింది. దీనిపై అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ను నిస్సాన్ సంస్థ కోరుతోంది. దీనిపై ప్రభుత్వ వర్గాల నుండి ఎటువంటి సమాచారం లేదు. బకాయిలు త్వరలోనే చెల్లిస్తామని దీనిపై అనవసర రాద్దాంతం వద్దని కేంద్ర ప్రభుత్వం కోరినట్టు తెలుస్తోంది.
నిస్సాన్ కంపెనీ తమిళనాడులో 2008లో కార్ల తయారీ పరిశ్రమను ప్రారంభించింది. నాడు కుదిరిన ఒప్పందం ప్రకారం పలు రాయితీలను తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ రాయితీలను నిస్సాన్ కంపెనీకి చెల్లించక పోోవడంతో సదరు సంస్థ ఈ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చింది. కేంద్రం కూడా ఈ వ్యవహారాలంలో నిస్సాన్ కు హామీ ఇచ్చినట్టు సమాచారం. ప్రభుత్వ హామీ మేరకు తమకు అందాల్సిన రాయితీలను ఇవ్వాల్సిందిగా నిస్సాన్ సంస్థ ఛైర్మన్ లేఖ రాసినా ఫలితం లేదని దీనితో ప్రధానికి లీగల్ నోటీసులు ఇవ్వడంతో పాటుగా అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కు కూడా ఫిర్యాదు చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *