తెలంగాణకు అభివృద్దికి కట్టుబడి ఉన్నాం-మోడీ

0
73

తెలంగాణ అభివృద్దికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో తెలంగాణ బీజేపీ నేతలు, కార్యకర్తలతో మోడీ సమావేశమయ్యారు. ఇందులో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతాన్ని అన్నిరకాలుగా అభివృద్ది చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని చెప్పారు. మోడీ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి సమావేశానికి వచ్చిన వారిని ఉత్సాహపర్చారు. హైదరాబాద్ అంటే తనకు సర్ధార్ వల్లభాయ్ పటేల్ గుర్తుకు వస్తారని అన్నారు. ఆయన చలవ వల్లే హైదరాబాద్ సంస్థానం భారత్ లో కలిసిందన్నారు. తెలంగాణ విమోచనం కోసం ప్రాణత్యాగం చేసిన వారికి జోహార్లు చెప్పిన ఆయన పటేల్ కు ప్రణామం చేస్తున్నాఅన్నారు. తెలంగాణను వీరభూమిగా పేర్కొన్నారు.

Wanna Share it with loved ones?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here