ప్రధాని ప్రసంగం ముఖ్యాంశాలు

పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై ప్రధాని జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. నోట్ల రద్దు తరువాత ప్రజలు పడుతున్న ఇబ్బందులు తనకు తెలుసన్నారు. ఒక మంచి భవిష్యత్తుకోసం ప్రజలు ఇబ్బందులకు కూడా లెక్కచేయడం లేదన్నారు. కొత్త సంవత్సరంలో మరింత ఉత్సాహంతో ముందుకు సాగాలన్నారు. మంచి భవిష్యత్తుకోసం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు మంచి మనసుతో అర్థం చేసుకున్నారని చెప్పారు. మంచి పనికి ప్రజల మద్దతు ఉంటుందనే విషయాన్ని నోట్ల రద్దు కు ప్రజామోదం రుజువు చేసిందని చెప్పారు.
ప్రధాని స్రసంగంలోని ముఖ్యాంశాలు.

  • ధైర్యాన్ని, సాహసాన్ని, సహనాన్ని ప్రజలు చూపించారు
  • దేశవ్యాప్తంగా ప్రజలు ధైర్యంతో కష్టాలు ఎదుర్కొంటూ చెడుపై విజయం సాధించేందుకు పోరాడుతున్నారు
  • స్వచ్ఛత దిశగా దేశం అడుగులు వేస్తోంది
  • అవినీతిపై పోరాటం చేయడానికి దేశ ప్రజలు అవకాశం కోసం ఎదురు చూశారు
  • పేద, మధ్యతరగతి ప్రజల గృహనిర్మాణం కోసం రెండు కొత్త పథకాలు .
  • ప్రధాన్‌మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద గ్రామాల్లో పెద్ద ఎత్తున గృహాల నిర్మాణం.
  • చిరు వ్యాపారులకు బ్యాంకు రుణ పరిమితి రూ.కోటి నుంచి రూ.2కోట్లకు పెంపు
  • సమాజంలోని నల్లధనం, బ్లాక్‌ మార్కెటింగ్‌ నిజాయితీపరుల్నినిరాశపరిచాయి
  • నగదు రద్దుతో నిజాయితీపరులు కూడా కాస్త కష్టపడ్డారు
  • సత్యం అన్నది భారతీయులకు ముఖ్యమైనది
  • దేశప్రజలు సత్యాన్ని, నిజాయితీని నిరూపించుకున్నారు
  • నవంబర్‌ 8 నుంచి ప్రజలు చెడుపై పోరాడుతున్నారు
  • ప్రజల ఆశీస్సులతో బ్యాంకుల వద్ద సాధారణ స్థితికి ప్రయత్నిస్తున్నాం
  • కొత్త సంవత్సరంలో మళ్లీ పూర్వస్థితిని తీసుకొస్తాం
  • మీరు చూపిన ప్రేమ నాకు ఆశీర్వాదం లాంటిది
  • బ్యాంకుల్లో పరిస్థితిని చక్కదిద్దేందుకు అధికారులు దృష్టి పెడుతున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *